Komatireddy Venkatreddy: 24/7 నల్గొండ ప్రజలకు అందుబాటులో ఉంటా
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:18 PM
Telangana: పేదవారి కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ళు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కా.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు.
నల్గొండ: పేదవారి కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkatreddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ళు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కా.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు. నల్గొండలో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తానన్నారు. ‘‘24/7 నల్గొండ ప్రజలకి అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడైనా మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని నా 4 నెంబర్ క్వార్టర్‌కు, సెక్రెటరేట్‌లో 5వ ఫ్లోర్‌లోని నా ఆఫీస్‌కు రావొచ్చు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాం’’ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. బెల్ట్ షాపులను ముయిస్తామని గంజాయి గ్యాంగుల ఆట కట్టిస్తామన్నారు. ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ నెల చివర్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.