Home » KonaSeema
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సర్వే నంబర్ల వారీగా స్టే ఆర్డరు జారీ చేసిన అక్రమ ఆక్వా చెరువులకు సంబంధించిన అఫిడవిట్‌ను జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్జీటీకి సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు.
వ్యవసాయ ఆధారిత అనుబంధ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్యర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.
విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద అమలాపురం రూరల్ బండారులంక జడ్పీ హైస్కూలులో భోజన పథక ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై అధికారులు పూర్తిగా అవగాహన పెంపొందించుకుని సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. ఇసుక నిర్వహణ వ్యవస్థ ఆన్లైన్ పోర్టల్ వినియోగంపై శనివారం తహసీల్దార్లు, రవాణా ఏజెన్సీలు, మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతర్ వెళ్లిన మహిళ అక్కడ పడుతున్న బాధలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. నరకయాతన పెడుతున్నారని, తనను స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ కన్నీటిపర్యంతమయ్యింది. పనికి కుదుర్చుకున్న యజమాని చిత్రహింసలకు గురి చేస్తోందని, ఆమె బారినుంచి తనను కాపాడి స్వదేశానికి తీసుకురావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ను వేడుకుంటూ పంపిచిన సెల్ఫీ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి తగు న్యాయం చేసే విధంగా రెవెన్యూ, పోలీస్, న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్ సూచించారు.
నీతి అయోగ్ సహకారంతో రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ ముసాయిదా నివేదికను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపొందించిన వెబ్సైట్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంచినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ చెప్పారు.
ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు సూచించారు. అమరావతి నుంచి చంద్రబాబు గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఇసుక నిర్వహణ వ్యవస్థపై నూతనంగా రూపొందించిన ఆన్లైన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.
కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ అలైన్మెంట్ ప్రకారం క్షేత్రస్థాయిలో సంపూర్ణ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. సర్వేచేసే గ్రామాలు, మండలాల వారీగా డివిజన్ స్థాయిలో మ్యాపులను సిద్ధం చేయాలన్నారు.