Share News

Gas leak: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు..

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:23 PM

యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Gas leak: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు..

కోనసీమ జిల్లా: గోదావరి నది నుంచి గ్యాస్ లీక్ కావడం కలకలం రేపుతోంది. యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరిలో ఓఎన్జీసీ సంస్థ గ్యాస్ పైప్ లైన్ వేసింది. అయితే రాత్రి నుంచీ గ్యాస్ లీక్ కావడం ఇంతవరకూ అధికారులు దాన్ని గుర్తించకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి తంతుండడంతో మంటలు వ్యాప్తించే ప్రమాదం ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


భారీగా లీకేజీ కావడంతో నీళ్లు సుడులు తిరుగుతున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. గ్యాస్ లీక్ కావడంతో భరించలేని వాసన వస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటివరకూ యాజమాన్య సంస్థ స్పందిచకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ సంస్థ తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడుతున్నారు.


అయితే ముందుగా గ్యాస్ లీకవుతున్న ఘటన మత్స్యకారులు ద్వారా తెలుసుకున్న యానాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు దినేశ్ సాహసించి సంఘటనా స్థలానికి బోటుపై వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆయన చిత్రీకరించి గ్యాస్ లీక్ ఆపాలంటూ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. అయితే ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీటిని చూసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనల వల్ల మంటలు చెలరేగి గతంలో ప్రమాదాలు జరిగాయి. అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ నష్టం జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

Buddha Venkanna: ఆ విషయం డైవర్ట్ చేసేందుకు విజయసాయిరెడ్డి ట్వీట్లు: బుద్దా వెంకన్న..

YS Jagan: అంతా కల్తీ.. ఐదేళ్లు మాటలతో మాయ..

Rahul Gandhi: ప్రతీ భక్తుడిని బాధపెడుతోంది.. క్షుణ్ణంగా పరిశీలించాలి

Updated Date - Sep 21 , 2024 | 12:25 PM