Home » KonaSeema
నూతన ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులు నేరుగా ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకునే సదుపాయాన్ని ఈ నెల 19 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు గనులశాఖ, రవాణాశాఖ సంయుక్తంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక దారి మళ్లకుండా ఇతరులు అధిక ధరలకు విక్రయించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కష్ట జీవుల కన్నీటి గాథ ఇది..గూడు లేని పేద బతుకుల గోడు ఇది..తలదాచుకునే చోటు కోసం అల్లాడుతున్న ఓ కుటుంబం బతుకు చిత్రమిది...35 ఏళ్ల కిందట కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ డ్రైనేజీ కోసం తెచ్చిన తూరనే ఇల్లుగా చేసుకుని కాలం వెల్లదీస్తున్న విషాద నేపథ్యం మడిమి దుర్గారావు కుటుంబానిది. అతను అతని భార్య దుర్గమ్మ, వారి కుమారుడు రామచంద్రపురం పెద్దవంతెన వద్ద వెల్ల రోడ్డు మలుపులో ఓ సిమెంట్ తూరలోనే జీవనం సాగిస్తున్నారు.
ముమ్మిడివరం మండలం కొత్తలంకలోని వలీబాబా దర్గా వద్ద ఆదివారం ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాబాకు గంధం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వస్తుండడంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా పరిధిలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయల వెంబడి ఉన్న కాజ్‌వేలన్నీ దాదాపు మునిగిపోయాయి. వరద తీవ్రతపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి సమీక్షించారు.
విద్యార్థుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకంమెనూలో మార్పులు చేయాల్సి ఉందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాగల 72 గంటల్లో గోదావరి వరద మహోగ్ర రూపం దాల్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. అధికారులు సూచించే ఆదేశాలను లంక గ్రామాల ప్రజలు ఖచ్చితంగా పాటించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా కోనసీమలోని గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయల్లో ప్రవాహ వేగం పెరుగుతోంది. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వర్షాల సీజన్ కావడంతో విద్యార్థులకు అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. సమనస మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఒకవైపు గోదావరి నదికి వరదలు.. మరోవైపు భారీ వర్షాలతో కోనసీమ జిల్లాలో ప్రజా జీవనం స్తంభించిపోయింది. గోదావరి నదులు ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక లంక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఉపాధి కరువైన లంక గ్రామాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం కారణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
గోదావరి వరద పెరుగుతుండడంతో కోనసీమలోని లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దాంతో కోనసీమలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహించడం వల్ల సమీపంలోని లంక గ్రామాల్లోకి వరదనీరు చేరుతోంది.