Home » Konda Surekha
మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని... ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు పఠాన్ చెరు మండలం గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వద్ద కాంగ్రెస్ ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
రైతుల పంటలు ఎండిపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వ మేనని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) విమర్శించారు. కాంగ్రెస్ (Congress) విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేవంలో ఆమె పాల్గొన్నారు.
లిక్కర్ కేస్, ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ని వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి ,కాంగ్రెస్ మెదక్ పార్లమెంటు ఇన్చార్జి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. బుధవారం నాడు పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్లో పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
Telangana: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వార్తలపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ పై కోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా’’ అని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై (Phone Tapping Case) తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. తన భర్త కొండా మురళీ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం కూతురుగా ఉన్నప్పుడు లిక్కర్ అక్రమ వ్యాపారం చేశారని కొండా సురేఖ ఆరోపించారు.
Telangana: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సతీమణినిపైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రింద కూర్చోబెట్టారన్నారు.
Telangana: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.
వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని విమర్శించారు.
Telangana: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం పర్యటించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఉద్యోగంలో చేరిన స్టాఫ్ నర్స్‌లకు మంత్రి టోపీలు ధరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.
మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.