Share News

Konda Surekha: ఎంజీఎంలో మంత్రి కొండా సురేఖ పర్యటన

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:51 PM

Telangana: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం పర్యటించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఉద్యోగంలో చేరిన స్టాఫ్ నర్స్‌లకు మంత్రి టోపీలు ధరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.

Konda Surekha: ఎంజీఎంలో మంత్రి కొండా సురేఖ పర్యటన

వరంగల్, మార్చి 8: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital) మంత్రి కొండా సురేఖ (Minister konda Surekha) శుక్రవారం పర్యటించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఉద్యోగంలో చేరిన స్టాఫ్ నర్స్‌లకు మంత్రి టోపీలు ధరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. నర్సింగ్ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల ఆసుపత్రికి వచ్చిన పేషంట్లకు అంకిత భావంతో సేవలు అందించాలని అన్నారు. కొంతమందికి వేతనాలు అందక ఇబ్బందులకు గురయ్యారని.. 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వరంగల్ జైలును కూలగొట్టిందన్నారు. ఆస్పత్రి పేరుతో భవనాలు నిర్మించి.. ఎంజీఎంకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అప్పు తెచ్చి డబ్బు వృధా చేశారని విమర్శించారు. ఎవరైన ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో (BRS Government) అవినీతి, అక్రమాలు త్వరలోనే బయటకు తీస్తామన్నారు. ఎంజీఎం ఆసుపత్రి ని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

MLC Kavitha: ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం..

YS Viveka: వైఎస్ ఫ్యామిలీలో ఊహించని పరిణామం.. రాజకీయాల్లోకి వివేకా ఫ్యామిలీ!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 01:54 PM