Share News

Telangana: మెదక్‌లో కాంగ్రెస్ సమావేశం.. బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Apr 10 , 2024 | 04:22 PM

రైతుల పంటలు ఎండిపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వ మేనని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) విమర్శించారు. కాంగ్రెస్ (Congress) విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేవంలో ఆమె పాల్గొన్నారు.

Telangana: మెదక్‌లో కాంగ్రెస్ సమావేశం.. బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు..

రైతుల పంటలు ఎండిపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) విమర్శించారు. కాంగ్రెస్ (Congress) విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేవంలో ఆమె పాల్గొన్నారు. రైతుల పంటలు పండుతున్నాయంటే కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టుతోనే అన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం వాళ్ల కుటుంబం, బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తల కోసమే పని చేసిందన్నారు. గత ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రజల వద్దకు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి తీరుతుందన్నారు.


TS Politics: బీఆర్‌ఎస్‌తో కలిసి సీఎం రేవంత్‌ సొంత దుకాణం.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి పనులు చేయలేదని కొండా సురేఖ ఆరోపించారు. ఓవైపు హరీష్‌రావు, మరోవైపు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 6గ్యారంటీలను అమలు చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వం 3నెలల కాలంలోనే ఆరె పథకాలను అమలు చేస్తోందన్నారు.


లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. కార్యకర్తలకు తగిన గౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై చేసే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్తలు పని చేయాలన్నారు.

HarishRao; సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కామెంట్స్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 04:22 PM