Balka Suman: దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు ఇంతటి అవమానమా..!
ABN , Publish Date - Mar 11 , 2024 | 01:42 PM
Telangana: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సతీమణినిపైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రింద కూర్చోబెట్టారన్నారు.
హైదరాబాద్, మార్చి 11: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి (Yadadri Temple) సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు (Deputy CM Bhatti Vikramarka) అవమానం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Former MLA Balka Suman) అన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ... రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చోబెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సతీమణినిపైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను (Minister Konda Surekha)కింద కూర్చోబెట్టారన్నారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి?... ఎవరికి చెప్పుకోవాలి? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైనా భట్టి విక్రమార్కనే అవమానించారన్నారు.
Lok Sabha Polls: ఆసక్తికర పరిణామం.. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తల పోటీ
74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుందన్నారు. యావత్ దళిత జాతిని ఈరోజు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి భట్టి విక్రమార్క ఫోటో పక్కన పెడుతున్నారని.... ప్రభుత్వ యాడ్స్‌లో డిప్యూటీ సీఎం ఫోటోను పక్కన పెట్టారన్నారు. జరిగిన ఘటనపై నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విసూనురి రామచంద్ర రెడ్డి లాంటి వాడు రేవంత్ రెడ్డి అని... భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హైకామండ్ స్పందించాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని బాల్క సుమాన్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
TS News: రేపు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో బిగ్ డే
Actress Aiswarya: రియల్ లైఫ్‌లో రూటు మార్చిన నటి.. రచ్చకెక్కిన భర్త!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...