Home » Kotamreddy Sridhar Reddy
బారాషాహిద్ దర్గాలో కుటుంబ సమేతంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 24 కోరికలు తీరాలని, చంద్రబాబు సీఎం కావాలని, తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుని ప్రత్యేకంగా తయారు చేసిన 24 కేజిల రొట్టెని ఆయన పట్టుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నేతలు వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు.
క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అలుపెరగని పోరాటం చేశానన్నారు. నాలుగేళ్లలో సీఎం జగన్ స్వయానా మూడు సార్లు ముచ్చటగా సంతకాలు చేసినా నిధులు విడుదల కాలేదన్నారు. గత నెలరోజులుగా క్రైస్తవ సోదరులతో పోస్ట్ కార్డు, మెసేజ్ పోస్టింగ్ ఉద్యమం చేపట్టినా ప్రయోజనం లేదన్నారు.
‘మీకే కష్టం వచ్చినా నా దగ్గరకు రండి. నా ఆఫీసు తలుపులు తీసే ఉంటాయి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాదే’’ అని ముఖ్యమంత్రి భరోసా ఇస్తారు. దాన్నినమ్మి జనం సీఎం ఆఫీసుకు వెళ్తారు. అక్కడికి ఓ వ్యక్తి వచ్చి నేను సీఎం ప్రతినిధిని నాకు చెబితే సీఎంకు చెప్పినట్లే..
వైసీపీ (YSR Congress) నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) మీడియా (Media) ముందుకొస్తే చాలు.. ఆయన ఏం సంచలన విషయాలు బయటపెడతారో ..
నెల్లూరు జిల్లా: నగరంలో ఎన్టీఆర్ నక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ పనులు పూర్తి అయితే నెల్లూరు ఆధ్యాత్మిక, సుందరంగా తయారు అవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బరాషాహిద్ దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
బారాషహిద్ దర్గా అభివృద్ధి పనులు జరగాలని ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా రొట్టెల పండుగని గుర్తించారన్నారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. పొట్టేపాళెం కలుజు వంతెన మరమ్మతులపై జలదీక్షకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి జలదీక్షకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు.