Home » KTR
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆదాయం ఎంత? అవినీతి ఎంత? నాడు అప్పు ఎంత? ఎవరెవరు ఎంత దోచుకున్నారో చర్చిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నగరంలోని లాల్‌బహుదూర్ స్టేడియంలో మీడియా సమక్షంలో 50 వేల మంది ప్రజలు చూసే విధంగా ఈ అంశంపై చర్చ చేద్దామని బీఆర్ఎస్ నేతలకు జూపల్లి సవాల్ విసిరారు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. మీ అవినీతి, అక్రమాలు, దోపిడికి సంబంధించిన అన్ని అంశాలను తాను రుజువు చేస్తానన్నారు.
అలవికాని హామీలిచ్చి సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు.
Telangana: రూ.3866 కోట్లతో 1200 ఎమ్ఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటుకు గతంలోనే ప్లాన్ చేశామని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మురుగు శుద్ధి విషయంలో చేయాల్సింది ఏమీ లేదన్నారు. కేవలం రిబ్బన్ కటింగ్ చేయడం మాత్రమే నిలిచిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవి, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తాను చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్వీట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ధ్యాస రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. మందుపై ఉన్న ధ్యాస మంచి బోధన, మందుబిళ్లలు, మూసీ బాధితులు, మంచినీళ్లపై లేదన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుకు రాకుండా డుమ్మా కొట్టారు.
మూసీ బ్యూటిఫికేషన్‌కు గానీ, ప్రక్షాళనకు గానీ, పునరుజ్జీవానికి గానీ తాము వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూసీ పేరుతో చేస్తున్న లూటిఫికేషన్‌నే తప్పుబడుతున్నామని చెప్పారు.
మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినేనని అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టుకు హాజరుకావలసి ఉంది. అయితే ఈ కేసు సోమవారంకు వాయిదా పడింది. దీంతో ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో పాలన చేతకాకే కాంగ్రెస్ పార్టీ నేతలు పనికిమాలిన మాటలు, పాగల్ పనులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.