Share News

BRS: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన కేసు విచారణ సోమవారానికి వాయిదా..

ABN , Publish Date - Oct 18 , 2024 | 08:05 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టుకు హాజరుకావలసి ఉంది. అయితే ఈ కేసు సోమవారంకు వాయిదా పడింది. దీంతో ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే.

BRS: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన కేసు విచారణ సోమవారానికి వాయిదా..

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టు (Nampally Court)కు హాజరుకావలసి ఉంది. అయితే ఈ కేసు సోమవారంకు వాయిదా పడింది. దీంతో ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు. మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha)పై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. మంత్రి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్ ఇవ్వనున్నారు.


గెలవలేమనే అడ్డగోలు హామీలు ఇచ్చారు..

‘‘గెలుస్తామని అనుకోకుండా అడ్డగోలు హామీలిచ్చామని ఓ కాంగ్రెస్‌ మంత్రి ఇటీవల నాతో అన్నారు. మీరే 15 మందిని మార్చుకుని ఉంటే గెలుస్తుండే అని చెప్పారు. నా పేరు చెప్పవద్దంటూ అన్నీ చెప్పేశారు’’ అని మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్వీ ప్రతినిధులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. అంతకుముందు గ్రూప్‌-1 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో సమావేశమై వారితో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో మహా ఉద్ధండ పిండాలతో కొట్లాడినం. చంద్రబాబు, రాజశేఖర్‌ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.

అంతటి ఉద్ధండుల ముందు ఈ చిట్టి నాయుడు ఒక లెక్క కాదు. ఈయనతో కొట్లాడదామంటే కూడా మనసు ఒప్పడం లేదు. మొన్న వికారాబాద్‌ వెళ్లి హైదరాబాద్‌ చుట్టూ మూడు దిక్కులు సముద్రం ఉందంటాడు. ఆగస్టు 15 రోజు ప్రసంగంలో భాక్రానంగల్‌ డ్యాం ఉందన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రకారం.. విప్రో సీఈవో సత్య నాదెళ్ల. ఆయనకు ఏం తెల్వదు. తెల్వదన్న విషయం కూడా ఆయనకు తెల్వదు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉంది పరిస్థితి. ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలకు కష్టం వచ్చినా.. గాంధీ భవన్‌, బీజేపీ ఆఫీస్‌కు కాకుండా తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. తెలంగాణ భవన్‌కు వెళ్తే కేసీఆర్‌ దండు ఉంటదని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. హైడ్రా బాధితులు కూడా ఇక్కడికే వస్తున్నారు. చిట్టినాయుడు పాలనలో బాధపడని వాళ్లు లేరు. ఊళ్లలో రైతులు తిడుతున్నారు. తులం బంగారం, బతుకమ్మ చీరలు.. ఏదీ దిక్కులేని పరిస్థితి తెచ్చారన్నారని మండిపడుతున్నారు’’ అని ఆయన అన్నారు.


మళ్లీ ప్రజలు మెచ్చే విధంగా దగ్గరవుదాం : కేటీఆర్

‘‘తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా బీజేపీ వాళ్లు ప్రశ్నించరు. పేదల ఇళ్లు కూల్చినా.. చిట్టి నాయుడు మొత్తం తెలంగాణను నాశనం చేసినా.. బీజేపీ వాళ్లు మాట్లాడరు. ఎందుకంటే బడే భాయ్‌.. చోటే భాయ్‌ ఇద్దరూ ఒక్కటే. పైననేమో జుమ్లా పీఎం.. ఇక్కడ హౌలా సీఎం. మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఈ రెండు పార్టీలతోనే. మతాన్ని, దేవుడ్ని అడ్డం పెట్టుకుని పిల్లల్ని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమి లేదు. పదినెలల్లో మన పార్టీ అన్ని కష్టకాలాలను అధిగమించింది. చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఊహించని విధంగా ఓడిపోయాం. ఆ తర్వాత కేసీఆర్‌కి గాయం. కొంతమంది పార్టీ మారటం, మన పార్టీ నాయకురాలు కవితను జైలుకు వెళ్లడం జరిగింది. తలవంచకుండా పోరాటం చేశాం. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలు మనకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి: సూపర్ 6తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు..

టీడీపీ కార్యాలయంపై దాడి తప్పు కాదట

మూసీకి పునరుజ్జీవం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 18 , 2024 | 09:46 AM