Home » KTR
‘ముందుగా మీకు హ్యాపీబర్త్‌డే.. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. రేవంత్‌రెడ్డీ.. మీ ఏసీబీలాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం. మీరు పంపేవాళ్లకు చాయ్.. ఉస్మానియా బిస్కెట్‌తోపాటు, వారు కట్ చేస్తామంటే మీ బర్త్‌డే కేక్‌ను కూడా నేనే ఇప్పిస్తా’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నా కమ్యూనిస్ట్‌లు తమతో కలిసి వచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుంటే తనకు జన్మనే లేదని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో మూసీ బాధితులు ఉంటే నల్గొండ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంత రైతులను సీఎం రేవంత్ రెడ్డి కలవడంలో ఆంతర్యం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘తప్పు చేసిన వారికి నాటు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటం బాంబు పేలబోతోంది. బీఆర్ఎస్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుల మీద తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదు.
ఫార్ములా-ఈ కారు రేసులకు సంబంధించి నిధుల విడుదలలో ఏ తప్పూ జరగలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతానంటే అందుకు రెడీగా ఉన్నానని ఆయన తెలిపారు. రెండు మూడు నెలల్లో జైల్లో ఉంటే ఏమవుతుందని ఈ సందర్బంగా కేటీఆర్ ప్రశ్నించారు. మంచిగా యోగా చేసుకుని బయటకు వస్తానన్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని విద్యార్థుల అవస్థలు సీఎం రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం.. కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం.. కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తోందని, ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మేఘా అధినేత కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల ఫాంహౌస్ పార్టీలో డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి బుధవారం రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీసుస్టేషన్లో విచారణకు హాజరయ్యారు.