Share News

KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:53 PM

హైదరాబాద్‌లో మూసీ బాధితులు ఉంటే నల్గొండ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంత రైతులను సీఎం రేవంత్ రెడ్డి కలవడంలో ఆంతర్యం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..
BRS Working president KTR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టే మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చి నల్గొండ మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. కూల్చిన ఇళ్లు ఎక్కడ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ అంటూ ధ్వజమెత్తారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు రేవంత్ రెడ్డి పాలన ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.


వారి బాధలు చూడు..

హైదరాబాద్‌లో మూసీ బాధితులు ఉంటే నల్గొండ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంత రైతులను రేవంత్ రెడ్డి కలవడంలో ఆంతర్యం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఆగిన గుండెలెక్కడ, రగిలిన మనసులెక్కడ.. మీరు చేసిన ఎర్రరంగు మార్కింగ్ ఎక్కడ, మీరు చేస్తున్న పాదయాత్ర ఎక్కడ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ కుట్రలకు అంబర్‌పేట్- అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే పుట్టినరోజు వేడుకలను రేవంత్ రెడ్డి జరుపుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.


ఇక్కడ చెయ్..

రేవంత్ రెడ్డి మూసీ దాహానికి అత్తాపూర్ ఆగమైందని, గోల్నాక గొల్లుమంటుందని, దిల్‌సుఖ్ నగర్ ఢీలా పడ్డిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అన్యాయాలకు ఆవేదనలు, ఆవేశాలు, ఆక్రందనలు వినిపిస్తున్నవి, కనిపిస్తున్నవి నల్గొండలో కాదని అన్నారు. హైదరాబాద్ వైపు చూడాలని, ఈ ప్రాంతంలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. తేలు మంత్రం వేయడం తెలియని వ్యక్తి.. పాము కాటుకు మంత్రం వేసినట్లు.. పాలన తెలియని రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్లో మట్టి పోశారంటూ మండిపడ్డారు. నాయకత్వం అంటే కూల్చడం కాదు నిర్మించడమని అన్నారు. నాయకత్వం అంటే దారి తప్పడం కాదు చూపడమని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.


ప్రశ్నిస్తే అరెస్టులా?

"సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారీ మా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధించడం అలవాటుగా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కుని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోంది. ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, హామీల అమలు వైఫల్యంపై నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం.


దమ్ముందా..?

నిర్బంధించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. నా అరెస్టు కోసం ఉవ్విళ్లూరుతున్న రేవంత్‌ రెడ్డి.. సుంకిసాల ఘటనలో మెఘా కృష్ణారెడ్డి కంపెనీని బ్లాక్‌ లిస్ట్ చేసేందుకు దమ్ముందా?. దమ్ముందా.. మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చెయ్యడానికి?. దమ్ముందా.. ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్‌’ని తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్‌ నుంచి తీసివేయడానికి?. దమ్ముందా.. లేదా?. సీఎం అయ్యుండి మెఘాకు గులాంగిరీ చేస్తున్నావా?" అంటూ విమర్శలు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Telangana: తోపులాటలో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి

Hyderabad: రేవంత్‌ సర్కార్‌పై యుద్ధం తప్పదు..

Updated Date - Nov 08 , 2024 | 01:20 PM