CM Revanth Reddy: బిల్లా, రంగాలు అడ్డుపడితే బుల్డోజర్‌తో తొక్కిస్తా.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Nov 08 , 2024 | 07:30 PM
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నా కమ్యూనిస్ట్‌లు తమతో కలిసి వచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుంటే తనకు జన్మనే లేదని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని స్పష్టం చేశారు.
యాదాద్రి: బీఆర్ఎస్ నాయకులకు దోచుకోవడం తప్పా.. మూసీ అభివృద్ధి పట్టదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు చూసేది ట్రైలర్ మాత్రమే.... జనవరిలో అసలు సినిమా ఉంటుందని మాజీ మంత్రులు హారీష్‌రావు, కేటీఆర్‌లకు వార్నింగ్ ఇచ్చారు. దశాబ్దాల క్రితం మూసీ నదిలో రూపాయి బిళ్ల వేస్తే కనిపించేదని ఇక్కడి ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుతం మూసీ చాలా కాలుష్యంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వలిగొండ మండలం సంగెం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ(శుక్రవారం) పాదయాత్ర చేపట్టారు. సంగెం నుంచి భీమలింగం వరకు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. స్థానిక రైతుల సమస్యలను అడిగి సీఎం రేవంత్‌రెడ్డి తెలుసున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... మూసీ నదికి ఓ ప్రత్యేకత ఉందని.. తెలంగాణలోనే పుట్టి నల్గొండ జిల్లాలోని త్రివేణి సంగమంలో కలుస్తుందని తెలిపారు. దేవుడు తమకు శాపం పెట్టాడా అని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. తమ జీవితాలు మారాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని.. వారి జీవితాలను తాను మారుస్తానని హామీ ఇచ్చారు. గీత కార్మికులు గీసే కల్లు కూడా చాలా కలుషితమైందని చెప్పారు. చేపలు, ఇక్కడ పెంచిన గొర్రెలను ఇక్కడి వారు తినడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. మూసీ నీళ్లతో పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేక రైతులు వ్యవసాయం బంద్ చేసే పరిస్థితుల్లో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరుతా..
‘‘మూసీ కాలుష్యం... క్యాన్సర్‌గా మారి గర్భిణులు బిడ్డలకు జన్మనిచ్చే పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నా కమ్యూనిస్ట్‌లు తమతో కలిసి వచ్చారు. మూసీ హైదరాబాద్‌లో అనుబాంబు ఆటంబాంబులా మారే అవకాశం ఉంది. లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టి దోచుకోవడానికి నేను రాలేదు. గంగానదిని ప్రక్షాళన చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచానికి దిక్సూచి అయ్యారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుంటే నాకు జన్మనే లేదు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతా. మూసీ అభివృద్ధికి ఎవరెవరు అడ్డుపడుతారో పేర్లు ఇవ్వండి....నల్గొండ జిల్లా ప్రజలతో బుల్డోజర్ తొక్కించక పోతే నా పేరే మార్చుకుంటా. బిల్లా, రంగాలు అడ్డుపడితే బుల్డోజర్‌తో మా మంత్రి కోమటిరెడ్డి ఎక్కించి తొక్కిస్తారు. ఎవరి దయా దక్షిణంతో నేను సీఎం కుర్చీలో కూర్చోలేదు. మా ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించింది మీరే కదా. మూసీకి అడ్డుపడితే మూసీలో కుక్క చావే గతి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డు పడితే చరిత్ర హీనులుగా మారుతారు. రూ. 2 కోట్లతో మూసీలో శివయ్య చుట్టూ దర్శనం చేసుకునేలా రోడ్డు నిర్మిస్తాం. చార్మినార్ మూసీ వాడపల్లి వరకు పాదయాత్ర చేస్తా. జనవరి మొదటి వారంలో మూసీ, ఇషా నదులు కలిసే వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తా.’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
Bandi sanjay: తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్
KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..
Read Latest Telangana News And Telugu News