Home » KTR
జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల ఫాంహౌస్ పార్టీలో డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి బుధవారం రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీసుస్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అప్పటి మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్.. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే విదేశీ కంపెనీలకు రూ.55 కోట్లు బదిలీ చేశామని చెప్పడం ఇప్పుడు కేటీఆర్‌కు చుట్టుకోనుందా?
తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డిలు తెలంగాణను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నీటి ప్రాజక్టుల పేరుతో ముఖ్యమంత్రి భారీ స్కాంలకు తెర తీశారని, మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయని ఆయన విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదని.. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలన్నారు. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదని.. కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడాలని కామెంట్స్ చేశారు.
‘‘రియల్ ఎస్టేట్ రంగం గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదని రేవంత్‌రెడ్డి చెప్పిండు.. సీఎం పదవంటే గుంపు మేస్త్రీ పోస్టు అన్నడు.. ఇప్పటివరకు నిర్మాణరంగానికి మేలు జరిగే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. పక్కకు తీసుకెళ్లి మాట్లాడితే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు ఏడుపొక్కటే తక్కువ. వాళ్లు అధికారంలోకి వచ్చి 11 నెలలైంది.
మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయామంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆటోడ్రైవర్లు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి, గద్దెనెక్కిన తర్వాత ప్రజల గొంతు కోశారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్లు చేశారు. వరుస పెట్టి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సహా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రాభివృద్ధి వంటి అంశాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
‘‘అవినీతి జరిగిందని బురదజల్లి.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి రైతుల పొట్టగొట్టిన మీరు.. సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుమతి లేకుండానే రూ.1074కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు?’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి , రూమ్ ఇచ్చామని కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని.. ఆయన్ను పక్కన పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నారని విమర్శించారు.