Share News

KTR: ప్రభుత్వ ఉన్నతాధికారులను హెచ్చరించిన కేటీఆర్

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:15 PM

తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డిలు తెలంగాణను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నీటి ప్రాజక్టుల పేరుతో ముఖ్యమంత్రి భారీ స్కాంలకు తెర తీశారని, మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

KTR:  ప్రభుత్వ ఉన్నతాధికారులను హెచ్చరించిన కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆడించినట్లు ఆడితే ఉన్నతాధికారుల ఉద్యోగాలు (Officers Jobs) ఊడగొడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) హెచ్చరించారు (Warning). తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti), మెగా కృష్ణారెడ్డిలు (Mega Krishna Reddy) తెలంగాణ (Telangana)ను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.. నీటి ప్రాజక్టుల పేరుతో ముఖ్యమంత్రి భారీ స్కాంలకు తెర తీశారని, మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయని విమర్శించారు.


పొంగులేటి ఏమైనా హోంమంత్రినా?

దీనిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. భారీ స్కాంలు జరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. క్యాబినెట్‌లో ఉంటే మంత్రి పొంగులేటి కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తారన్నారు. పొంగులేటి జైలుకు పోవటానికి రెడీగా ఉండాలన్నారు. వాళ్ళు, ఈళ్ళు జైలుకు పోతారని చెప్పటానికి పొంగులేటి ఎవరని ప్రశ్నించారు. పొంగులేటి ఏమైనా హోంమంత్రినా.. అని అన్నారు.

బాంబులు పేల్చుడు కాదు.. ముందు పొంగులేటి జైలు పోవటానికి రెడీగా ఉంటాలని కేటీఆర్ అన్నారు. మూసీ ప్రాజెక్ట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నారని, మూసీ ప్రాజెక్ట్ కాంట్రాక్టు సైతం మెగా కృష్ణారెడ్డికి చెంది‌న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వనున్నారని అన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయని, తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని, పొంగులేటిపై ఈడీ రైడ్స్ జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు.


అలాగే బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (Social Media) వేదికగా విమర్శలు (Comments) గుప్పించారు. ‘‘గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ - గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు.., గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు - కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు.., ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు - పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు.., నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు - ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడు.., నీ మూసి ముసుగులు కాదు - కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు.., పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు - పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడు.., నీ కాసుల కక్కుర్తి - నీ కేసుల కుట్రలు కాదు - పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడు.., దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి .. సన్నవడ్లకు సున్నం పెడితివి .. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం వైపు చూడు’’ అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు..

అమెరికా ప్రజల తీర్పు ఇదేనా ..

ఫలితాలు తారుమారు.. ట్రంప్‌కి బిగ్ షాక్..

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణం

ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 06 , 2024 | 01:45 PM