Home » KTR
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలోదకాలు ఇచ్చేశారని బీజేపీ ఎంపీ ధర్మపూరి అర్వింద్ మండిపడ్డారు. ఏ హామీ అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి రేవంత్ రెడ్డి సర్కార్ ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పాదయాత్ర చేపడతానని ప్రకటించడంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఇది పాదయాత్రా లేకుంటే పదవుల యాత్రో స్పష్టం చేయాలని కేటీఆర్‌ను అర్వింద్ డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు కుక్క కూడా ఓటు వేయదని, ఆయన తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసినా ఫలితం ఉండదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖపు చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే.. కొత్త సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్ మనసులో మాటను బయటపెట్టారు. మరోవైపు తెలంగాణలో బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి వాడపల్లికి..
కార్యకర్తల ఆకాంక్ష మేరకు త్వరలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆస్క్ కేటీఆర్ పేరిట గురువారం ఎక్స్ వేదికగా చేపట్టిన కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
మూసీ నిర్వాసిత కుటుంబీకులతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెకొలేకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గురువారం వినూత్న నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పది నెలల పాలనే విసుగొస్తే బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఎలా భరించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు విశ్వసించరని విమర్శించారు. కేటీఆర్‌కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు.
Telangana: మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర వార్తలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్‌తో పాటు ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి. ‘‘మేం పాదయాత్ర చేస్తే దాడులు చేశారు. ముందు కేసీఆర్‌ను ఫామ్ హౌస్ నుంచి బయటకు రమ్మను’’ అంటూ
Telangana: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో సంభాషించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ప్రజలు, కార్యకర్తల ఆకాంక్ష మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాని స్పష్టం చేశారు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు.