KTR: కేటీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణ వ్యాప్తంగా
ABN , Publish Date - Nov 01 , 2024 | 12:23 PM
Telangana: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో సంభాషించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ప్రజలు, కార్యకర్తల ఆకాంక్ష మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 1: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Working President KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రజలతో కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.
Pension Plan: 40 ఏళ్ల వ్యక్తి రూ. 50 వేల పెన్షన్ పొందాలంటే ఎంత జమ చేయాలి..
కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత తన ముందున్న బాధ్యత అని తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని ప్రకటించారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో సంభాషించారు కేటీఆర్.
LPG Gas: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు
కాగా.. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కేటీఆర్ గట్టిగానే పోరాడుతున్నారు. కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రతీరోజు ఏదో ఒక అంశంపై ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా రుణమాఫీ, రైతు బంధు విషయంలో ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. ఆ ప్రాజెక్టు పేరుతో పేదలను ఖాళీ చేయించి కూల్చివేయడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌పై పోరాడేందుకు కేటీఆర్ మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించిన ఆయన ప్రజల పక్షాన పోరాడటమే ప్రస్తుత బాధ్యత అని చెప్పుకొచ్చారు.
రైతులను నిండా ముంచింది...
కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వానాకాలం వరికోతలు సాగుతున్నాయని.. కానీ నేటి వరకు రైతుబంధు వేయలేదని.. రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదని మండిపడ్డారు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదన్నారు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైందన్నారు. ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారని.. అక్టోబరు నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కానీ, అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని... రైతన్న అంటే ఎంత నిర్ల్యక్షం చూడండి అంటూ వ్యాఖ్యలు చేశారు. దళారులతో కుమ్మక్కైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదని ఆరోపించారు. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక.. ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు ప్రక్రియ నిలిచిందన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నారంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Diwali 2024: దీపావళి అలంకరణ.. ఈ టిప్స్‌తో ఇంట్లో వెలుగులు రెట్టింపు
Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..
Read Latest Telangana News And Telugu News