Share News

AP GOVT: ఏపీ వరద బాధితులకు కుమారీ ఆంటీ సాయం

ABN , Publish Date - Sep 23 , 2024 | 10:54 PM

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంతో ఫేమస్ అయిన కుమారి అంటీ రూ. 50 వేల విరాళం ఇవాళ(సోమవారం) అందజేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు కుమారి ఆంటీ చెక్కు అందచేశారు.

AP GOVT: ఏపీ వరద బాధితులకు కుమారీ ఆంటీ సాయం

అమరావతి: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంతో ఫేమస్ అయిన కుమారి అంటీ రూ. 50 వేల విరాళం ఇవాళ(సోమవారం) అందజేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు కుమారి ఆంటీ చెక్కు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కుమారి అంటీ రూ. 50వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కుమారి అంటీ చేసిన కృషిని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే రాము తెలిపారు.

KUMARIE.jpg


ఏపీ డీజీపీ భేటీ...

chandrababu-ap-cabinet.jpg

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఏపీ డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చించారు. సిట్ చీఫ్‌గా సీనియర్ ఐజీ నియామకంపై సమాలోచనలు చేశారు. సీఎం పరిశీలనలో వినీత్, త్రిపాఠి, శ్రీకాంత్ పేర్లు ఉన్నట్లు సమాచారం. సిట్‌లో మిగతా సభ్యులపై సీఎం చంద్రబాబు చర్చించారు. తిరుమలలో నెయ్యి కొనుగోలు, టెండర్ వ్యవహారాలపై సిట్ అధికారులు విచారణ జరపనున్నారు.


విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై చర్చ...

అమరావతి: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులకు అండగా ఉండాలనే అధికారంలోకి రాగానే పింఛను రెట్టింపు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవాళ్లకు దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.15 వేలు పింఛను ఇస్తున్నామని అన్నారు. ప్రతి అర్హుడికీ పింఛన్ అందాలని...అనర్హులు స్వచ్ఛందంగా తమ పింఛన్లు వదులుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులు పింఛన్ పొందితే అర్హులకు నష్టం చేసినట్లేనని అన్నారు. వృద్ధులకు డిజిటల్ లిటరసీ ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం చంద్రబాబు అన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 11:11 PM