Share News

Viral News: కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఈ ట్వీట్ చూశారో నవ్వు ఆపుకోలేరంతే!

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:34 PM

Kumari Aunty Dialogue: కుమారి ఆంటీ (Kumari Aunty).. ఇప్పుడీ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.! యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ.. ఆంటీ.. వాయిస్, వీడియోలే కనిపిస్తుంటాయ్.! హైదరాబాద్‌లోని (Hyderabad) మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే.. సామాన్యురాలు కుమారి.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ (2 Livers Extra) అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను (Social Media) షేక్ చేశాయి...

Viral News: కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఈ ట్వీట్ చూశారో నవ్వు ఆపుకోలేరంతే!

కుమారి ఆంటీ (Kumari Aunty).. ఇప్పుడీ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.! యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ.. ఆంటీ.. వాయిస్, వీడియోలే కనిపిస్తుంటాయ్.! హైదరాబాద్‌లోని (Hyderabad) మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే.. సామాన్యురాలు కుమారి.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ (2 Livers Extra) అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను (Social Media) షేక్ చేశాయి. దెబ్బకు ఫుడ్ లవర్స్ అంతా కుమారి ఫుడ్ కోర్టు ముందు క్యూ కట్టారు. సీన్ కట్ చేస్తే.. ట్రాఫిక్ జామ్ ఆ మరుసటి రోజే ఫుడ్ కోర్టు ఎత్తేయాలని సంబంధిత అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లడం.. ఆ తర్వాత.. సామాన్యురాలు (Common Man) వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister) దాకా వెళ్లడం ఇదంతా అందరికీ తెలిసిందే. మళ్లీ అదే స్థానంలోనే ఫుడ్ కోర్టు నడిపించుకునేలా చూడాలని అధికారులను రేవంత్ ఆదేశించారు కూడా. ఇప్పుడు సాఫీగానే అంతా నడుస్తోంది. అయితే ఆంటీ డైలాగ్ మాత్రం ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది.


kumari-aunty.jpg

ఇదీ అసలు సంగతి..

ఇదిగో ఈ ట్వీట్‌ను కాస్త గమనిస్తే.. అసలు విషయం ఏంటో టక్కున తెలిసిపోతుంది. బుల్లెట్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఫొటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ( Hyderabad Traffic Police) ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు..‘ మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు.. కుమారి ఆంటీ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు. కుమారి ఆంటీని బాగానే ఫాలో అవుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఎమోజీలు, కుమారి ఆంటీ డైలాగ్ వీడియోలు పోస్టు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. మరికొందరేమో.. ఒకప్పుడు ఇదే కుమారి ఆంటీని ఫుడ్ కోర్టు పెట్టకుండా చేశారు.. ఇప్పుడు ఆమె డైలాగ్‌నే ఇలా వాడేస్తున్నారు.. అట్లుంటది మరి ఆంటీ అంటే.. వాడకం అంటే ఇదేనేమోఅని ఒకింత పోలీసులను విమర్శిస్తున్న నెటిజన్లూ ఉన్నారు.

Hyderabad-Traffic-Police-Tw.jpg

ఇప్పుడు ఆంటీ వంతు అంతే..!

చూశారుగా.. కుమారి ఆంటీ డైలాగ్‌ను పోలీసులు ఏ రేంజ్‌లో వాడేస్తున్నారో..! ఇదొక్కటే కాదండోయ్.. సమయం, సందర్భాన్ని బట్టి సినిమా డైలాగ్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తుల డైలాగ్స్‌ను జతచేస్తూ అప్పుడప్పుడు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చురకలు అంటిస్తుంటారు. ఇప్పుడు కుమారి ఆంటీ డైలాగ్ వంతు వచ్చిందంతే..!

Kumari Aunty Food: హోటల్‌కు వస్తానన్న సీఎం రేవంత్.. కుమారీ ఆంటీ రియాక్షన్ ఇదీ..!

Updated Date - Feb 20 , 2024 | 02:34 PM