Home » Kuppam
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలకు శ్రేణులు సమయత్తమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటనలు జరగనున్నాయి. జనవరి 11న నరసరావుపేటలో పవన్‌తో కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తారు.
చీకటిపల్లిలో రైతులపై దాడినితెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఖండించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ...రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతల దాడి చేశారని చంద్రబాబు నాయుడు చెప్పారు.
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో రైతులపై వైసీపీ నాయకుల దౌర్జన్యం, అరాచకం మితి మీరిపోతోంది. వైసీపీ శ్రేణుల దాడిలో ఆరుగురు రైతులు గాయపడ్డారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటన గుడుపల్లి మండలం. వెంకటాపురంలో జరిగింది.
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పానికి ఏనుగుల ప్రమాదం పొంచి ఉంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుంచి కుప్పం వైపు 70 ఏనుగుల గుంపు తరలివస్తోంది. రాత్రి తమిళనాడు హోసూరు సరిహద్దులో 70 ఏనుగుల గుంపు హల్చల్ చేసింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్ (Nara Chandrababu Arrest) తర్వాత ఏపీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిత్యం ప్రజల కోసం.. ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే విజనరీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి!..
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పటాసులు పెట్టి మరీ వైసీపీ కవ్వింపుచర్యలకు పాల్పడింది.
చిత్తూరు: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులకు నిరసనలు ఎదురవుతున్నాయి. షిర్డి రైలు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌ను స్థానిక ప్రజలు ప్రశ్నలతో నిలదీశారు. ఎన్నికల కోసం హామీలిచ్చి అమలు చేయడం మరిచారని మహిళలు ఇద్దరినీ ప్రశ్నించారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి... ఏబీఎన్ - ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.