Home » Ladakh
అక్టోబర్ 21న భారత్, చైనా మధ్య బలగాల ఉపసంహరణ, పెట్రోలింగ్ పునరుద్ధణకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29లోగా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉండగా, ఇరువర్గాలు తమ మౌలిక సదుపాయాలను తొలగించి వెనక్కి మళ్లాయి.
ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.
నేడు (జులై 26) కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) లడఖ్(Ladakh)లోని కార్గిల్‌లో పర్యటించనున్నారు. ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
లద్దాఖ్‌లోని భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో భారీగా స్మగ్లింగ్ చేస్తున్న బంగారం పట్టుబడింది.
గడ్డకట్టే చలి, ఇసుక గాలులు, కళ్లు తిరిగే లోయలు... ఇవేవీ ఆమెను వెనక్కి లాగలేదు. బండి జారి కింద పడినా...
లడాఖ్ టీ-72 యుద్ద ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో పలువురు సైనికులు వీర మరణం పొందారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ అనే ముగ్గురు సైనికులు ఉన్నారు. సైనికుల మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు నేడు యోగా డే సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని కూడా సైనికులు ప్రజలకు అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
లడఖ్(Ladakh)కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరాహార దీక్ష నేపథ్యంలో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 7న పష్మీనా మార్చ్ ప్రకటించారు. దీని దృష్ట్యా లెహ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఎప్పుడూ లేనంతగా వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం నాడు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా జనాలు ప్రదర్శనలు చేశారు. శనివారం.. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి.
భారత్- చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి మారింది. ఆ ప్రాంతంలో గొర్రెలను మోపేందుకు కాపారులు కూడా వెళ్లడం లేదు.