Ladakh Shepherds:చైనా సైనికులతో లడఖ్ కాపారుల వాగ్వివాదం
ABN , Publish Date - Jan 31 , 2024 | 12:54 PM
భారత్- చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి మారింది. ఆ ప్రాంతంలో గొర్రెలను మోపేందుకు కాపారులు కూడా వెళ్లడం లేదు.
శ్రీనగర్: భారత్- చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి మారింది. ఆ ప్రాంతంలో గొర్రెలను మోపేందుకు కాపారులు (Shepherds) కూడా వెళ్లడం లేదు. అయితే ఇటీవల కాపారులు గొర్రెలను మేత కోసం ఎల్ఏసీ వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చైనా సైనికులు అడ్డుకున్నారు. ఇక్కడికి రావొద్దని కోరగా.. వారిని కాపారులు ధీటుగా ఎదుర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది.
పాన్ గాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గొర్రెల కాపారులను అడ్డుకున్నారు. చైనా సైనికులుతో కాపారులు వాదించారు. తమ భూ భాగంలో ఉన్నామని, తమ హక్కులను వాడుకుంటున్నామని తేల్చిచెప్పారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చైనా సైనికులకు తెగేసి చెప్పారు. 2020లో గల్వాన్ వద్ద ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గొర్రెల కాపారులు ఆ వైపుగా వెళ్లడం లేదు. తాజాగా కొందరు వెళ్లగా చైనా సైనికులు ప్రశ్నించారు. వారికి గొర్రె కాపారులు ధీటుగా సమాధానం ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.