Share News

Congress: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:03 PM

Telangana: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్‌ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.

Congress: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

ఢిల్లీ, ఏప్రిల్ 6: సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secundrabad Cantonment) అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం (Congress High Command) ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్‌ (Narayana Sri Ganesh)పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ (AICC General Secretary KC Venugopal) ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్‌లో (Congress) చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (lasya Nandita) మృతితో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.

Alert: ఎన్నికల వేళ మరో కుట్రకు తెరలేపుతున్న చైనా.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక


secun-cont-ganesh.jpg


కాగా.. బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల్యాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక (BY Election) అనివార్యమైంది. మే 13న కంటోన్మెంట్ ఉపఎన్నిక జరుగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉద్దేశంతోనే ముందుకు సాగుతోంది. కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రెస్.. శ్రీ గణేష్ పేరును అధికారికంగా ప్రకటించింది. కంటోన్మెంట్ కోసం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొలు (Congress strategist Sunil Kanugulu) నాలుగు సార్లు సర్వేలు చేయగా.. కంటోన్మెంట్‌లో అరవ మాల సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. శ్రీ గణేష్ అరవ మాల సామాజికవర్గం కావడంతో హస్తం నేతలు అతడి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లేనందున కంటోన్మెంట్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం.. ఆ నియోజకవర్గాలకు..

AP Politics: ఎన్నికల వేళ జగన్‌కు నాన్‌స్టాప్ షాక్‌లే.. వైసీపీ నుంచి ఎమ్మెల్యే జంప్..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 06 , 2024 | 01:05 PM