By Poll: కాంగ్రెస్ కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!
ABN , Publish Date - Mar 23 , 2024 | 10:36 AM
Telangana: బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల్యాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. మే 13న కంటోన్మెంట్ ఉపఎన్నిక జరుగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉద్దేశంతోనే ముందుకు సాగుతోంది. కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రెస్.. అందుకు అభ్యర్థి ప్రకటనపై ముహూర్తం కూడా నిర్ణయించింది. ఈనెల 27వ తేదీన కంటోన్మెంట్ అభ్యర్థిని హస్తం పార్టీ ప్రకటించనుంది.
హైదరాబాద్, మార్చి 24: బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల్యాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక (BY Election) అనివార్యమైంది. మే 13న కంటోన్మెంట్ ఉపఎన్నిక (Secundrabad Cantonment) జరుగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) కూడా ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉద్దేశంతోనే ముందుకు సాగుతోంది. కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రెస్.. అందుకు అభ్యర్థి ప్రకటనపై ముహూర్తం కూడా నిర్ణయించింది. ఈనెల 27వ తేదీన కంటోన్మెంట్ అభ్యర్థిని హస్తం పార్టీ ప్రకటించనుంది. అలాగే శ్రీ గణేష్‌ను (Sri Ganesh) తమ అభ్యర్థిగా కాంగ్రెస్ అనౌన్స్ చేయనుంది. కంటోన్మెంట్ కోసం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొలు (Congress strategist Sunil Kanugulu) నాలుగు సార్లు సర్వేలు చేయగా.. కంటోన్మెంట్‌లో అరవ మాల సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. శ్రీ గణేష్ అరవ మాల సామాజికవర్గం కావడంతో హస్తం నేతలు అతడి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లేనందున కంటోన్మెంట్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Delhi Liquor Scam: కవితకు మరో బిగ్ షాక్.. మళ్లీ ఈడీ సోదాలు!
పోటీకి రెడీ అంటున్న లాస్య నివేదిత
మరోవైపు కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరనే విషయంపై బీఆర్‌ఎస్‌లో ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. అయితే లాస్య నందిత సోదరి నివేదిత తాను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవలే ప్రకటించారు. కార్యకర్తలు, ప్రజలు కోరిక మేరకే తాను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి తన నిర్ణయాన్ని చెబుతానని అన్నారు. బీఆర్‌ఎస్ అధిష్టానం పోటీకి అంగీకరిస్తే... పార్టీకి అతీతంగా తనకు మద్దతు ఇవ్వాలని కూడా నివేదిత కోరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా కంటోన్మెట్ ఉప ఎన్నికకు సై అనడంతో.. బీఆర్‌ఎస్ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
Phone Tapping: ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. వారి ఇళ్లల్లో సోదాలు..
Viral Video: మరో రికార్డు బ్రేక్ చేసిన ఎంఎస్ ధోని
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...