TG Politics: తెలంగాణలో ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ తరఫున బరిలో నివేదిత!
ABN , Publish Date - Mar 16 , 2024 | 06:28 PM
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి మే13 వ తేదీన పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Cantonment) అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి మే13 వ తేదీన పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో లాస్యనందిత బీఆర్ఎస్ (BRS) నుంచి పోటీచేసి గెలుపొందగా.. బీజేపీ నుంచి శ్రీ గణేష్, కాంగ్రెస్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేశారు. ప్రస్తుతం కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటంతో ఎవరు పోటీలో ఉంటారనే చర్చ నెలకొంది.
మళ్లీ ఆ కుటుంబం నుంచే..
కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యేల్ విడుదలైన రోజే ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. దీంతో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పోటీలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
కంటోన్మెంట్ నుంచి తన పోటీపై దివంగత నేత సాయన్న కుమార్తె నివేదిత స్పందించారు. తనతండ్రి సాయన్నకు మద్దతుగా నిలిచిన నియోజకవర్గ ప్రజలు తన సోదరి లాస్య నందితను గెలిపించారని, దురదృష్టవశాత్తు తన సోదరి ప్రమాదంలో మృతిచెందారని నివేదిత తెలిపారు. స్థానిక నాయకత్వం కంటోన్మెంట్ బరిలో ఉండాలని కోరుకుంటున్నారని.. వాళ్లందరి మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.
నో క్లారిటీ..
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పోటీపై క్లారిటీ రాలేదు. ఒకవేళ పోటీచేస్తే బీజేపీ తరపున గత ఎన్నికల్లో పోటీచేసిన శ్రీగణేష్‌కు టికెట్ ఇస్తుందా... వేరే అభ్యర్థిని పోటీకి నిలుపుతుందా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ సైతం గద్దర్ కుమార్తెకు మళ్లీ టికెట్ ఇస్తుందా లేదా అనేదానిపై డైలమా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
MLC Kavitha: కవిత తరుఫున లాయర్ విక్రమ్ వాదనలేంటంటే..
TG Politics: బీఆర్‌ఎస్‌కు షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి