TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
ABN , Publish Date - Mar 24 , 2025 | 10:57 AM
మాజీ మంత్రి విడదల రజిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. రజినీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి జాషువా స్టేట్‌మెంట్, ఇతర అధికారుల స్టేట్‌మెంట్‌లు కూడా ఉన్నాయన్నారు. తాను వైయస్సార్సీపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా తాను మాట్లాడలేదని.. కానీ..

న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ నాయకురాలు (YSRCP Leader) , మాజీ మంత్రి విడదల రజిని (Ex Minister Vidadala Rajini) చేసిన వ్యాఖ్యలపై (Comments) టీడీపీ ఎంపీ (TDP MP) లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) కౌంటర్ (Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తానేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని, తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని, మావాళ్ళకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదని అన్నారు. ఫోన్ డేటా, భూముల విషయాలపై ఆరోపణలు చేశారని, 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుపుతున్నామని, ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు. అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమికోసం దరఖాస్తు చేసుకున్నాయని, తమ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
Also Read..: మంచి శకునాల్లో మొదటిది ఏంటంటే..
2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని అధిక ధర చెల్లించి భూమిని పొందామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. వేలానికి, కేటాయింపుకు మధ్య చాలా తేడా ఉందన్నారు. ఇదంతా రజినీతో ఎవరు మాట్లాడించారో తనకు బాగా తెలుసునని అన్నారు. ఒకరిని విమర్శించే ముందు వివరాలు తెలుసుకోవాలని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వులపాలవుతారని అన్నారు. విడదల రజిని మాదిరిగా అబద్ధాలు చెప్పలేనన్నారు. రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగా కేసులు నమోదు చేయిస్తున్నారన్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ఐపీఎస్ జాషువా సర్వీసు 2040 వరకు ఉందని, జాషువా స్టేట్‌మెంట్‌లో లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్‌కు.. తనకు ఎలాంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. 2021 ఆగస్టు 24న రజినీ నుంచి ఫిర్యాదు వచ్చిందని, లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్‌లో అక్రమాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారన్నారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు సాక్షి రిపోర్టర్ మాధవరెడ్డిని రజినీయే తీసుకువెళ్లారని, ఐపీఎస్ ఆఫీసర్ పీ. జాషువాను బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో జాషువా ఈ అంశాన్ని మైన్స్ అధికారులకు సమాచారం ఇవ్వగా, మైన్స్ విభాగం అధికాకులు విపరీతమైన ఫైన్ వేశారని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అక్రమాలు చేసి.. మళ్లీ రెడ్ బుక్ అంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రజినీ తన స్వార్థం కోసం అధికారులను బెదిరించి డబ్బులు లాక్కున్నారని ఆమెపై ఫిర్యాదులు ఉన్నాయన్నారు. పోతారం భాషా, ఎంపీపీ శంకర్ రావు, ముత్తా వాసు, గోల్డ్ శ్రీను, మున్నంగి, అబ్బాస్ ఖాన్, నాగయ్య, ఇలా చాలా మంది దగ్గర రజనీ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదన్నారు. పది రోజుల క్రితం ఒక మధ్యవర్తిని తన దగ్గరికి పంపించి ఈ కేసును ఆపమని రాయబారం నడిపిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఆ స్టోన్ క్రషర్స్‌కు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన మాట నిజం కాదా.. తప్పులు చేసి, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలా అని ఎంపీ ప్రశ్నించారు.
రజినీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి జాషువా స్టేట్‌మెంట్, ఇతర అధికారుల స్టేట్‌మెంట్‌లు కూడా ఉన్నాయన్నారు. తాను వైయస్సార్సీపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా తాను మాట్లాడలేదని.. కానీ ఇప్పుడు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని.. అందుకే తాను ఇప్పుడు మాట్లాడుతున్నానని అన్నారు. తనకు బూతులు చేతకావని, రజినీ మాదిరిగా అబద్ధాలు చెప్పలేనని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాకింగ్ తర్వాత ఈ పొరపాట్లు చేయకండి
For More AP News and Telugu News