Share News

TDP MP: జగన్ మరో స్కాం.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 07:52 PM

MP Sri Krishna Devarayalu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణలో వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP MP: జగన్ మరో స్కాం.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Lavu Sri Krishna Devarayalu

ఢిల్లీ: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్‌కు రూ. 2వేల కోట్లు మద్యం, డబ్బు తరలించారని తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇవాళ(సోమవారం) లోక్‌సభలో సంచలన విషయాలను లావు శ్రీకృష్ణ దేవరాయలు బయటపెట్టారు. రూ. 2,000 కోట్లు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్‌కు జగన్ మళ్లించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో Adan, Graysons, Leela, JR Associates, PV Spirits లాంటి 26 కొత్త కంపెనీలు భారీ లాభాలను పొందాయని లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు.

Lavu-Srikrishna-Devarayalu.jpg


నాసిరకం బ్రాండ్లతో స్కాం..

రూ. 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కన్నా జగన్ మద్యం కుంభకోణం అతి పెద్దదని షాకింగ్ కామెంట్స్ చేశారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కామ్ చేసిన ఘనత జగన్‌దేనని ఆరోపించారు. జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి, నాసిరకంగా ఉన్న కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారని చెప్పారు. నంద్యాలలోని స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ డిస్టిలరీలను బలవంతంగా తీసుకుని, కొత్త బినామీ డిస్టిలరీలను ఏర్పాటు చేశారని అన్నారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి, వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ అనుబంధ వ్యాపారస్తుల చేతికి వెళ్లేలా చేశారని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్

High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 08:23 PM