Home » LK Advani
బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. జైల్లో ఉండాల్సిన ఆయనకు భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కోసం 1990లో అద్వాణీ చేపట్టిన రథయాత్ర దేశంలో మతకల్లోహాలు సృష్టించిందని విమర్శించారు.
బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ(Lalkrishna Advani)కి అత్యున్నత ‘భారతరత్న’ ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో బీజేపీకి ప్రత్యేకించి ఆడ్వాణికి దశాబ్దాలకాలంగా సంబంధాలు ఉన్నాయి. దేశంలో బీజేపీ అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది.
మాజీ ఉప ప్రధాని, రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
‘భారతరత్న’ పురస్కారం వరించడంపై మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (LK Advani Bharat Ratna) తొలిసారి స్పందించారు. అత్యంత వినమ్రత ,కృతజ్ఞతతో ప్రదానం చేసిన 'భారతరత్న'ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు.
‘భారత రత్న’ అవార్డుకు ఎంపికైన ఎల్‌కే అద్వానీ(LK Advani)కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలిపారు. భారత రాజకీయాల్లో అద్వానీ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.
దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారత రత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా స్పందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి ఆయన అభినందనలు తెలిపారు.
ఎల్‌కే అద్వానీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. ఆయన సేవలకుగానూ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటిస్తున్నట్లు కేంద్రం శనివారం వెల్లడించింది. ఎల్‌కే అద్వానీ(LK Advani) పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ.