Home » Lok Sabha Election 2024 Live Updates
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీకి అగ్నిపథ్ అంశం తలనొప్పిగా మారేలా ఉంది. సొంతంగా మెజార్టీ దక్కకపోవడంతో టీడీపీ, బిహార్‌లోని జేడీయూ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఇలాంటి కీలక తరుణంలో జేడీయూ తన తొలి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభంజనం దిశగా వెళ్తోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం దాదాపు కూటమి 150కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకుంది. ప్రధానంగా ఉరవకొండ సెంటిమెంట్‌ను ఈ ఎన్నికలు బ్రేక్ చేశాయి.
కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుని విశ్లేషకులకు కూడా షాకిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలకు దాదాపు రెట్టింపు సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ స్వంతంగా 100కు పైగా సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 2014లో కేవలం 44, 2019లో 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షంగా కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. సోమవారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సోనియా హాజరై నివాళి అర్పించారు.
లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.