Home » Lok Sabha Election 2024 Live Updates
Lok Sabha Election Polling 2024: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాలకు ఈ 4వ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా.. త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్న జనాలు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు.
Lok Sahba Elections 4th Phase Polling: దేశ వ్యాప్తంగా10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. తెలంగాణలోనూ నేడు పోలింగ్ జరగనుంది. నాలుగో దశలో తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లో 25, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్ 8, జమ్మూ కాశ్మీర్‌లో 1 చొప్పున లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
దేశంలో మత విద్వేషాల ద్వారా బీజేపీ పాలన సాగిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చినట్లు మతాన్ని నమ్మవచ్చని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలు తీసుకు వచ్చి మైనార్టీలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రూ. 16లక్షల కోట్ల రుణాలను కార్పోరేట్ శక్తులకోసం మోదీ మాఫీ చేశారని ధ్వజమెత్తారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో సారి వైయస్ జగన్ అధికారం అందుకోవాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అండ్ కో భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కానీ.. వైయస్ జగన్‌కే గెలుస్తారని తమకు అందుతున్న సమాచారమంటూ వివిధ చర్చ వేదికల్లో వారు స్పష్టం చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ శుక్రవారం ఉదయమే ప్రారంభమైంది. కాగా.. కర్ణాటకలో(Karnataka) తొలి దశలో జరుగుతున్న పోలింగ్ ఇది. రాష్ట్రంలో రెండు దశల్లో 28 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా రెండో విడత లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రారంభమైన వేళ.. ఓటర్లనుద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు. ఓటర్లంతా రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. వారెవరో, వారి నియోజకవర్గాలేంటో తెలుసుకుందాం.
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం అంటే.. ఏప్రిల్ 26న జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియనుంది. మరోవైపు.. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయంలో సమీస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం ప్రచారం కోసం రంగంలోకి దిగుతుంది. అందులోభాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నేతలు కోరారు.