Delhi: రెండో విడత పోలింగ్ వేళ.. ఓటర్లకు ప్రధాని మోదీ కీలక సూచనలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 08:26 AM
దేశవ్యాప్తంగా రెండో విడత లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రారంభమైన వేళ.. ఓటర్లనుద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు. ఓటర్లంతా రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండో విడత లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రారంభమైన వేళ.. ఓటర్లనుద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు. ఓటర్లంతా రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
అధిక ఓటింగ్.. ప్రజాస్వామ్యాన్ని మరోసారి బలోపేతం చేస్తుందన్నారు. ఓటు ప్రజల గొంతుక అని యువత, మహిళలు ఈ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నారు. ఓటుతోనే ఇష్టమైన నేతను ఎన్నుకోవచ్చని.. ఏ సమస్య ఉన్న పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
Delhi: లోక్‌సభ రెండో విడత బరిలో కీలక నేతలు.. ఎవరెవరంటే
అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాం, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లలో 3, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది.
ఈ దశలో దేశవ్యాప్తంగా 88 నియోజకవర్గాల నుంచి 1,202 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 543 సీట్లకు సంబంధించిన మొత్తం ఫలితాలు జూన్ 4న ప్రకటిస్తారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశలో ఓటింగ్ శాతం తగ్గడంతో రెండో దశలోనైనా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం(EC) అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది.
Read Latest National News and Telugu News