Home » Lok Sabha Election 2024
కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 156కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక గాయపడిన 130 మంది వయనాడ్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుకున్న విధంగా ఫలితాలను సాధించపోవడానికి కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్‌లో ఓటమి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండేను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ అసెంబ్లీలో సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నేతగా వ్యవహించారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు.
వారీస్ పంజాబ్ దే అధ్యక్షుడు, ఖదూర్ సాహెబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ చన్నీ మండిపడ్డారు. లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన అమృత్ పాల్ సింగ్‌ను నిర్బందంలో ఉంచడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్ల దాడి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సమయంలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ నివేదిక ఆరోపించింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి బీజేపీ లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమిపై ఆమె తనదైన శైలిలో స్పందించారు.
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్సీపీతో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' ఒక రిపోర్ట్‌లో తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఆ క్రమంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజవాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య మాటల యుద్దం వాడి వేడిగా సాగుతుంది.
దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ అనుకున్నని సీట్లు మాత్రం గెలుచుకో లేక పోయింది. ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 43 స్థానాలను కైవసం చేసుకుంది.