Share News

Uttar Pradesh: అఖిలేష్ రాజీనామా.. కొత్త ప్రతిపక్ష నేత ఎంపిక

ABN , Publish Date - Jul 28 , 2024 | 05:35 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండే‌ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ అసెంబ్లీలో సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నేతగా వ్యవహించారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు.

Uttar Pradesh: అఖిలేష్ రాజీనామా.. కొత్త ప్రతిపక్ష నేత ఎంపిక
UP Leader of Opposition Mata Prasad Pandey

లఖ్‌నవూ, జులై 28: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండే‌ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ అసెంబ్లీలో సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు. దీంతో కర్హల్ అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపిక అనివార్యమైంది.

Also Read: Rahul Gandhi: సివిల్స్ ఆశావహులు మృతి.. మూల్యం చెల్లించుకుంటున్న సామాన్యుడు


ఎస్పీ కీలక ప్రకటన...

అలాంటి వేళ.. ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన మాతా ప్రసాద్ పాండే‌ను ప్రతిపక్ష నేతగా పార్టీ అధిష్టానం నియమించింది. అలాగే యూపీ అసెంబ్లీలో విప్‌గా పార్టీ ఎమ్మెల్యే కమల్ అక్తర్‌‌, రాణిగంజ్ ఎమ్మెల్యే రాకేశ్ కుమార్ వర్మను డిప్యూటీ విప్‌గా నియమించింది. ఆదివారం లఖ్‌నవూలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమైయ్యారు.

Also Read:West Bengal: మహిళ ఫిర్యాదు.. టీఎంసీ మరో నేత అరెస్ట్


సూపర్ సీనియర్ నేత.. అందుకే...

అనంతరం ఈ మేరకు సమాజవాదీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో మాతా ప్రసాద్ పాండే ఒకరు. ప్రస్తుతం ఆయన ఎటావా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ క్రమంలో రెండు సార్లు యూపీ అసెంబ్లీ స్పీకర్‌గా సైతం మాతా ప్రసాద్ పాండే వ్యవహరించారు.

Also Read: Viral Video: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం.. వీడియోలో వివరించిన యూట్యూబర్ ?


లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న ఎస్పీ...

మరోవైపు దేశంలోనే ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలు 80 ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చాలా స్థానాల్లో ఓటమిని చవి చూసింది. అయితే ఈ ఎన్నికల్లో సమాజావాదీ పార్టీ ఎంపీలు 37 స్థానాలను కైవసం చేసుకుంటే.. బీజేపీ మాత్రం 33 స్థానాలకు పరిమితమైంది.


ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

దీంతో యూపీలో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కారణమనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం యూపీలో పార్టీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఒకటికి రెండు సార్లు సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ అయ్యారు. ఇంకోవైపు యూపీలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సైతం ఈ లోక్ సభ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాయి. దాంతో ఆ యా పార్టీలు సైతం కొన్ని సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.


సీఎం.. డిప్యూటీ సీఎంల మధ్య పెరిగిన దూరం...

అదీకాక.. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగికి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యల మధ్య దూరం పెరిగిందనే ఓ ప్రచారం సైతం సాగుతుంది. అలాగే ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేశవ్ ప్రసాద్ మౌర్యతోపాటు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి వేర్వేరుగా ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ క్రమంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పార్టీ చీఫ్ జేపీ నడ్డా సూచించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు వినిపిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నుకునే అవకాశముంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 05:37 PM