Mumbai : అవకతవకలతో 79 సీట్లలో బీజేపీకి లబ్ధి
ABN , Publish Date - Jul 23 , 2024 | 05:51 AM
లోక్‌సభ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సమయంలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ నివేదిక ఆరోపించింది.
ముంబై, జూలై 22: లోక్‌సభ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సమయంలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ నివేదిక ఆరోపించింది. పోలైన ఓట్లు మొదట ప్రకటించినప్పటి కంటే చివరిగా వెల్లడించే సమయానికి అనూహ్యంగా 4,65,46,885 పెరిగాయని, ఏడు దశల పోలింగ్‌లో ఈ పెరుగుదల 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకు ఉందని పేర్కొంది. అలాగే పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య కూడా తేడా ఉందని పేర్కొంది. దీని వల్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 79 స్థానాల్లో లబ్ధి కలిగిందని తెలిపింది. ఇందులో ఒడిసాలో 18, మహారాష్ట్రలో 10, పశ్చిమ బెంగాల్‌లో 10 స్థానాలు ఉన్నాయని వివరించింది.