Share News

jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు

ABN , Publish Date - Jul 24 , 2024 | 03:46 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్ల దాడి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది.

jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు

న్యూఢిల్లీ, జులై 24: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్ల దాడి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి జులై 15వ తేదీ వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లలో 10 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మరణించారని వివరించింది.

Also Read: AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్


బుధవారం రాజ్యసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాత పూర్వకంగా సమాధాన మిచ్చారు. ఇక ఈ ఆర్టికల్ రద్దు తర్వాత.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో శాంతి శకం అరంభమైందన్నారు. అలాగే రాష్ట్రం పురోగామి దిశగా సాగుతున్నందని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులతోపాటు ప్రభుత్వ సంస్థలన్నీ సజావుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.


అయితే గతంలో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఆందోళనలు, నిరసనలు, బంద్‌లు, రాళ్ల దాడులు నిత్యకృత్యంగా జరిగేవన్నారు. దీంతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా ఉండేదని.. కానీ నేడు ఆ పరిస్థితులు అయితే జమ్మూ కశ్మీర్‌లో లేవన్నారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాష్ట్ర ప్రజలు.. స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోనేందుకు పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తిన విషయం మరవరాదన్నారు.


మరోవైపు జమ్మూ కశ్మీర్‌కు పర్యాటకులు భారీగా భారీ సంఖ్యలో పెరిగారని వివరించారు. అది కూడా 2023 ఏడాదిలో 2.11 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ అందాలను వీక్షించారని విశదీకరించారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు.. సాంఘిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇంకోవైపు జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు పెరిగాయంటూ.. ప్రతిపక్షాలు ఆరోపించాయి. అలాగే పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చోరబాట్లు సైతం కొనసాగుతున్నాయని విమర్శించింది. అయితే జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులకు ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల న్యూఢిల్లీలో ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేసిన విషయం విధితమే.


జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుందని సమాచారం. ఇక కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిందని చర్చ నడుస్తుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 24 , 2024 | 03:46 PM