Home » Lok Sabha Elections
లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) పోటీ చేస్తున్న దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 359 మంది 5వ తరగతి వరకు చదివారు.
లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. లేదు.. తమ కూటమికి ప్రజలు పట్టం కడతారని ఇండియా కూటమి అంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదంటూ పార్టీ ఇచ్చిన షోక్ నోటీసుపై బీజేపీ సీనియర్ నేత, హజారీబాగ్ ఎంపీ జయంత్ సిన్హా స్పందించారు. షోకాజ్ నోటీసు చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదని, ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదో వివరణ అడుగుతూ బీజేపీ జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు షోకాజ్ నోటీసు జారీ చేశారన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని భారత్‌లో కలుపుతామంటూ కేంద్ర హొంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తడం సరికాదని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైంది. గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్ పూర్తైన తరువాత వారం పాటు పోటీపడి బెట్టింగ్‌లు కట్టారు. కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందేలు కాస్తే.. మరికొందరు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందంటూ పందేలు కట్టారు.
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా... లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు. ‘నేను ఎక్కడికీ పారి పోలేదు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మరో రెండు దశలు పూర్తైతే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ ఈనెల 25వ తేదీన జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉండటం ఒకటైతే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ రాష్ట్రం నుంచి పోటీచేస్తుండటంతో యూపీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఎంతోమంది ప్రముఖులు యూపీలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల దృష్టి యూపీ, బీహార్‌పైనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. యూపీతో పోలిస్తే బీహార్ రెండు కూటములకు కీలకంగా మారింది.