Rahul Gandhi: ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి: రాహుల్ గాంధీ
ABN , Publish Date - May 23 , 2024 | 03:49 PM
లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. లేదు.. తమ కూటమికి ప్రజలు పట్టం కడతారని ఇండియా కూటమి అంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. లేదు.. తమ కూటమికి ప్రజలు పట్టం కడతారని ఇండియా కూటమి అంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4వ తేదీన ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆయన వివరించారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటున్నారు. ఢిల్లీలో ఉన్న 7 లోక్ సభ సీట్లను కూటమి గెలుచుకుంటుందని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ గురువారం నాడు ఆంధ్రా భవన్ వచ్చారు. అక్కడ అటు, ఇటు కలియ తిరిగారు. అనంతరం ఆంధ్రా క్యాంటీన్‌లో భోజనం చేశారు. తర్వాత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యాంగం మార్చాలని బీజేపీ అనుకుంటుందని సందేహాం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకొచ్చారని రాహుల్ గాంధీ విమర్శించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారని స్పష్టం చేశారు. దేశంలో 90 శాతం పేదలు ఉన్నారని రాహుల్ గుర్తుచేశారు.
దేశంలో ఏం జరుగుతుందో జనాలు గమనిస్తున్నారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తమ వజ్రాయుధం అయిన ఓటుతో తగిన బుద్ది చెప్పారని విశ్వాసంతో ఉన్నారు. దేశ సంపదను తన కోవర్టులకు ప్రధాని మోదీ దోచి పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ సంపద అదానీ, అంబానీ చేతిలో కేంద్రికృతమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Latest National News and Telugu News