Lok Sabha Polls 2024: పీఓకేపై బీజేపీ, టీఎంసీ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం..
ABN , Publish Date - May 23 , 2024 | 02:05 PM
మరోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని భారత్‌లో కలుపుతామంటూ కేంద్ర హొంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తడం సరికాదని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది.
మరోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని భారత్‌లో కలుపుతామంటూ కేంద్ర హొంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తడం సరికాదని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. యూపీలోని భదోహి లోక్‌సభ స్థానం తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న లితేష్ పతి త్రిపాఠి అమిత్ షా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోకుండా.. ఎన్నికల ప్రచారంలో ప్రజలను అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారని లితేష్ పతి త్రిపాఠి పేర్కొన్నారు. అభివృద్ధి అజెండాను కాకుండా భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో బీజేపీ ఇతర అంశాలను తెరపైకి తీసుకొస్తుందన్నారు.
Mallikarjuna Kharge : అయోధ్యపై బుల్డోజర్ అబద్ధం
టీఎంసీ నేత త్రిపాఠి మాట్లాడుతూ..పీఓకేని వెనక్కి తీసుకోవడం గురించి మాట్లాడటమంటే.. మరో దేశానికి చెందిన భూబాగాన్ని స్వాధీనం చేసుకోవడమేనన్నారు. గతంలో భారత్‌లో అంతర్భాగమైనప్పటికీ.. ప్రస్తుతం ఇతర దేశంలో భాగంగా ఉన్న భూభాగాన్ని తీసుకోవాలంటే యుద్ధం చేయాల్సి ఉంటుంది.. పరోక్షంగా ఎ్నికల ప్రచారంలో యుద్ధం గురించి అమిత్ షా మాట్లాడుతున్నారని లితేష్ పతి త్రిపాఠి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేదికలపై యుద్ధం గురించి ప్రకటించకూడదన్నారు. దేశ ప్రజలకు ఎవరు మంచి పాలన అందిస్తారనే ప్రాతిపదికన జరుగుతున్న ఎన్నికల్లో యుద్ధ ప్రస్తావన సరికాదని లితేష్ పతి త్రిపాఠి అభిప్రాయపడ్డారు.
యూపీలో టీఎంసీ
ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా, రాష్ట్రంలో భారత కూటమికి నాయకత్వం వహిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇండియా కూటమి తృణమూల్ కాంగ్రెస్‌కు భదోహి స్థానాన్ని వదిలిపెట్టింది. ఈ స్థానం నుంచి లలితేష్ త్రిపాఠి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గాను 79 స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంటుందని, కేవలం వారణాసిలోనే బీజేపీతో గట్టిపోటీ ఎదుర్కొంటున్నామని అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే.
పాక్‌కు.. రాహుల్, అఖిలేశ్ జై
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News