Home » Lok Sabha Polls 2024
ఒక్కో దశ పోలింగ్ ముగిసేకొద్దీ ఇండియా కూటమి విజయానికి మరింత చేరువ అవుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ‘‘మోదీ పతనం ఖాయం. ఈ విషయం జూన్ 4వ తేదీన తేలిపోతుంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్‌లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తుచేశారు.
ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
కేడర్ అంచనాలు కాస్తంగా ఎక్కువగా కనిపిస్తున్నా అభ్యర్థులు మాత్రం సొంతంగా వేసే అంచనాలు. లెక్కలు అన్నీ ఇప్పటి వరకు ఇంకా పక్కాగా తేలలేదు. గెలుపు, ఓటమిలను పక్కనపెట్టి మెజారిటీ ఎంతనేదే అభ్యర్థుల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగానే పోలింగ్ ముగిసి వారం గడుస్తున్నా ఇంకా పక్కాగా లెక్క తేలలేదు. కేవలం తాము వేసుకున్న అంచనాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో సానుకూలత, వచ్చే మెజార్టీ మాత్రమే లెక్కించగలిగారు. కొంత మంది ముఖం చాటేసి ఏ రూపంలో నష్టపరిచింది కూడా లెక్క కట్టేశారు..
దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని పార్టీల కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాది భారీ విజయాలతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 సీట్లు దాటుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘మరోసారి మోదీ సర్కారు...
ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం వెళ్లడంతో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది. అయితే ఇక్కడ ఎస్పీ బిందు మాధవ్‌తో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు సంబంధాలున్నాయంటూ ఓ పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దానిపై ఆయన స్పందించారు.