Prime Minister modi: దక్షిణాది మాదే
ABN , Publish Date - May 21 , 2024 | 05:23 AM
దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని పార్టీల కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాది భారీ విజయాలతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 సీట్లు దాటుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘మరోసారి మోదీ సర్కారు...
అక్కడ అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీకే
దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 400 సీట్లు
పీటీఐకి ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ
భువనేశ్వర్, మే 20: దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని పార్టీల కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాది భారీ విజయాలతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 సీట్లు దాటుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘మరోసారి మోదీ సర్కారు... నాలుగో తారీఖున 400 సీట్లు’’ నినాదంతో దేశవ్యాప్త ప్రచారం చేసినట్లు చెప్పారు.
ఆదివారం రాత్రి ఆయన పీటీఐ వారాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదన్న ప్రచారాన్ని ఈసారి ఎన్నికల్లో పటాపంచలు చేస్తామన్నారు. తమ మిత్రపక్షాలు కూడా దక్షిణాదిలో పెద్ద ఎత్తున సీట్లు గెలవబోతున్నాయని చెప్పారు. ఓట్లశాతం భారీగా పెరగనుందని ప్రకటించారు. దక్షిణాదిలో 131 సీట్లుంటే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 29 సీట్లు గెలిచి, దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఒడిసా, బెంగాల్లో కూడా బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి ఇతర పార్టీలకు, మీడియా సంస్థలకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రెడ్ కారిడార్‌గా పేరొందిన ప్రాంతం కాషాయ కారిడార్‌గా మారిపోనుందని ప్రకటించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి గత నాలుగు దశల ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరవని పరిస్థితి నెలకొందని చెప్పారు. తాము ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటామని అన్నారు. బీజేపీ అంటే ఉత్తరాది పార్టీయని, బనియా-బ్రాహ్మిణ్ పార్టీ అని పథకం ప్రకారం చేసిన దుష్ప్రచారాన్ని ఈ ఎన్నికలతో పటాపంచలు చేస్తామని మోదీ ప్రకటించారు.
అందుకే పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని వ్యాఖ్యానించారు. టెంపో నిండా డబ్బు పంపితే అదానీ-అంబానీలకు వ్యతిరేకంగా మాట్లాడనని స్వయంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ అన్నారని మోదీ ప్రస్తావించారు.
మూడోసారి అధికారానికి రాగానే ఉమ్మడి పౌర స్మృతి, జమిలి ఎన్నికలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అమలు చేయాల్సిన అంశాలను ఇంతకుముందే సిద్ధం చేశామని, వాటిని 125 రోజుల్లో అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారు. తాను మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని, బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మోదీ చెప్పారు. ఎవరినీ ప్రత్యేక పౌరులుగా గుర్తించడానికి తాను సిద్ధంగా లేనన్నారు.
కాంగ్రెస్ మైనారిటీల ఓట్ల కోసం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తిని ఉల్లంఘిస్తోందని, దాన్ని మాత్రమే తాను ప్రస్తావిస్తున్నానని చెప్పారు. కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ బీజేపీయేనని మోదీ ప్రస్తావించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను మొత్తం రిజర్వేషన్లను ముడి పెట్టి మాట్లాడటం సరికాదని ప్రధాని అన్నారు. ఈసారి కాంగ్రెస్ కార్యకర్తలే ఆ పార్టీకి ఓటేయడానికి బయటకు రాలేదని,