Share News

AP Elections 2024: ఏలూరు లోక్‌సభలో గెలిచేదెవరు.. అభ్యర్థుల్లో టెన్షన్‌.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..!?

ABN , Publish Date - May 21 , 2024 | 02:12 PM

కేడర్‌ అంచనాలు కాస్తంగా ఎక్కువగా కనిపిస్తున్నా అభ్యర్థులు మాత్రం సొంతంగా వేసే అంచనాలు. లెక్కలు అన్నీ ఇప్పటి వరకు ఇంకా పక్కాగా తేలలేదు. గెలుపు, ఓటమిలను పక్కనపెట్టి మెజారిటీ ఎంతనేదే అభ్యర్థుల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగానే పోలింగ్‌ ముగిసి వారం గడుస్తున్నా ఇంకా పక్కాగా లెక్క తేలలేదు. కేవలం తాము వేసుకున్న అంచనాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో సానుకూలత, వచ్చే మెజార్టీ మాత్రమే లెక్కించగలిగారు. కొంత మంది ముఖం చాటేసి ఏ రూపంలో నష్టపరిచింది కూడా లెక్క కట్టేశారు..

AP Elections 2024: ఏలూరు లోక్‌సభలో గెలిచేదెవరు.. అభ్యర్థుల్లో టెన్షన్‌.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..!?

కేడర్‌ అంచనాలు కాస్తంగా ఎక్కువగా కనిపిస్తున్నా అభ్యర్థులు మాత్రం సొంతంగా వేసే అంచనాలు. లెక్కలు అన్నీ ఇప్పటి వరకు ఇంకా పక్కాగా తేలలేదు. గెలుపు, ఓటమిలను పక్కనపెట్టి మెజారిటీ ఎంతనేదే అభ్యర్థుల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగానే పోలింగ్‌ ముగిసి వారం గడుస్తున్నా ఇంకా పక్కాగా లెక్క తేలలేదు. కేవలం తాము వేసుకున్న అంచనాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో సానుకూలత, వచ్చే మెజార్టీ మాత్రమే లెక్కించగలిగారు. కొంత మంది ముఖం చాటేసి ఏ రూపంలో నష్టపరిచింది కూడా లెక్క కట్టేశారు.

ఏలూరు జిల్లా, ఆంధ్రజ్యోతి: సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) భాగంగా పోలింగ్‌ నాడు విజేత ఎవరో.. ఓటమి చెందేది ఎవరో.. టూకీగా ఓ లెక్కకు వచ్చింది. అయినా గడిచిన వారం రోజులుగా తాము పోటీచేసిన నియోజకవర్గాల్లో అటు వైసీపీ, టీడీపీ రెండు పదేపదే బూత్‌ల వారీగా తమ బలాబలాలను క్షేత్రస్థాయిలో ఆరా తీశాయి. ఏ ఏ గ్రామాల్లో తమకు సాను కూలత వచ్చింది. ఫలితంగా ఎంత మెజార్టీ వస్తుంది ? అనే అంచనాలు ఒకరు, మరెన్ని గ్రామాల్లో తమ అంచనాలు తల్లకిందులయ్యాయి.. వచ్చే మైనస్‌ ఎంత ? అని ఆరా తీయటంలో ఇంకొకరు ? బిజీబిజీగా ఉన్నారు. కూటమి పక్షాన క్షేత్రస్థాయిలో క్యాడర్‌ మాత్రం ఓటరు నాడి తమ వైపే ఉందని, ఏ మాత్రం డోకా లేకుండా కచ్చితమైన మెజారిటీ వస్తుందని, ఇప్పుడు తమ పరిధి లోనే లెక్కకట్టి అభ్యర్థులకు చేరవేశారు. కొంచెం తేడా పాడా వచ్చినా మెజారిటీ ఖాయమనే రీతిలోనే వీరంతా ఇప్పటికే తమ నివేదికల్లోనూ పేర్కొంటున్నారు.

AP Elections 2024: గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గెలిచేదెవరు.. కేశినేని చిన్నీ మెజార్టీ ఎంత..?



TDP-vs-YSRCP.jpg

నువ్వా నేనా అన్నట్లుగా..?

ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన దగ్గర నుంచి పోలింగ్‌ ముగిసేంత వరకు ఎన్నికల ప్రక్రియలో గెలుపు ఓటమిలు నిర్దేశించే క్రమంలో ప్రతి నియోజకవర్గానికి వేళ్ల మీద లెక్కించే కొందరు నేతలు ఉంటారు. ఈసారి పొద్దుపోయే వరకు మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనటం, పొరుగు ప్రాంతాల నుంచి వేలాది మంది నియోజక వర్గాలకు చేరి తమ ఓటు హక్కును వినియోగించుకో వడం, ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న మరికొన్ని వర్గాలు ఎవరూ ఊహించని రీతిలో పోలింగ్‌ కేంద్రాలకు తరలి రావడం ఈ పరిణామాలను ఇప్పటికే క్షుణంగా అధ్యయనం చేశారు. దెందులూరు నియోజక వర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఆది నుంచి పోలింగ్‌ సాగింది. ఓటర్లు రెండు వైపులా అనుకూలంగా మొహరించారు. వీరు కాక తటస్తులు, రైతు వారి వర్గం, మహిళలు ఇక ఏ వైపు మొగ్గు చూపారు అనేది ప్రతి ఊరి నుంచి లెక్క కడుతున్నారు. ఎందుకనంటే అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గంలో నువ్వా నేనా అనే విధంగా ఎన్నికలు సాగటంతో ఇక్కడ అంచనాలకు వచ్చేందుకు సీనియర్లు ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంకోవైపు కూటమి పక్షాన మడు పార్టీలకు చెందిన కేడర్‌ ఏకపక్షంగా పోలింగ్‌లో పాల్గొన్నారా ? లేక ఎవరైనా పక్కచూపులు చూశారా ? ఈ కారణంగా నష్టం జరిగిందా ? అనే దానిపై ఇప్పుడు ఈ వారం రోజులు ప్రత్యేక అధ్యయనమే చేశారు. ఎందుకనంటే ఆది నుంచి ఓటు బదిలీ సక్రమంగా సాగితేనే కూటమికి అనుకూలత మరింత పెరుగుతుందని, ఆ దిశగానే ముందు నుంచి అన్ని ప్రయత్నాలు నేతలు చేసినా కిందిస్థాయి కేడర్‌ అనుగుణంగా స్పందించింది లేనిది అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ అంతర్గతంగా ఆరా తీస్తూ వచ్చారు.

Vallabhaneni Vamsi: గన్నవరంలో మాయమై డల్లాస్‌లో వల్లభనేని వంశీ ప్రత్యక్షం.. ఎందుకా అని ఆరాతీస్తే..?



Karumuri-And-JAgan.jpg

అభ్యర్థులు ఎక్కడికక్కడే..?

ఎన్నికల సమరాంగణంలో 180 రోజులపాటు తీరిక లేకుండా సీట్లు ఖరారు వరకు ఎత్తులు, పైఎత్తులతో అన్ని పార్టీలు నిమగ్నం అయ్యాయి. పోలింగ్‌ జరిగేంత వరకు వరి అంకంలో అనుకూలతలు, వ్యతిరేఖత లెక్క కట్టడంలో పోటీ చేసిన అభ్యర్థులు తమకు స్పష్టమైన సంకేతాలు వచ్చేలా క్షేత్రస్థాయిలో ఆరా తీసి మరి అంకెలు కూడారు. ఓ వైపు కూటమి అభ్యర్థులు ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో తమదే పైచేయి కాగలదని, ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. మెజార్టీలు క్యాడర్‌ ఆశించినట్లు ఉంటే ఆసాంతం ఫలితాలు ఏకపక్షమేనని అభ్యర్థులు భావిస్తున్నారు. లేదా మెజారిటీ మొదటి రౌండ్‌ నుంచి అరకొరసాగితే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుందని, వైసీపీ అభ్యర్థులు భావిస్తున్నారు. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని దెందులూరు, ఉంగుటూరు నియోజక వర్గాలపైనే ఎక్కువ మంది బెట్టింగ్‌లకు దిగుతున్నారు. ఒకటికి రెండు పెంచి మరీ ఇస్తామంటూ ఎవరైనా సిద్ధమా అంటూ ప్రేరేపిత కామెంట్లు చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో బలం, బలహీనతలపై ఇంకోసారి సరిచూసుకునే క్రమంలో అభ్యర్థులంతా ఉన్నారు. ప్రత్యే కించి టీడీపీ సీనియర్లు అంతా ఇప్పటికే నలుదిక్కులా అంచనా వేసి నమోదైన పోలింగ్‌ శాతాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రామాల వారీగా తమ అనుకూలతలను ఇప్ప టికే అభ్యర్థులకు చేరవేయటం, దీనిపైనే ఇప్పుడు తుది కసరత్తులో అభ్యర్థులంతా ఉన్నారు. వాస్తవానికి పోలింగ్‌ ముగిసిన వెంటనే పోటీ చేసిన అభ్యర్థులంతా తమకు తోచిన ప్రాంతాలకు వెళ్ళి కొన్నాళ్ళు సేద తీరుతారు. కాని అర డజను మంది అభ్యర్థులు మినహా మిగతా వారంతా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోనే మకాం వేశారు.


Putta-and-Chandrababu.jpg

పుట్టా మహేశ్‌కే మొగ్గు!

అసెంబ్లీ పార్లమెంట్‌కు ఒకే దఫా ఎన్నికలు జరిగినందున ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసిన వారంతా సమాంతరంగా ఎంపీ అభ్యర్థిని బలపరిచారా ? లేక ? క్రాస్‌ ఓటింగ్‌కు దిగారా ? అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. దీని దరిమిలా నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల బలా బలాలను, అంచనా వేస్తున్నారు. ఎందుకనంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే అటు వైసీపీ, ఇటు కూటమి రంగంలోకి దింపాయి. కూటమి అభ్యర్థి పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌ స్వల్ప వ్యవధిలోనే నియోజకవర్గాల్లో దూసుకు వెళుతున్నారు. ఎక్కడ ఏ వివాదం లేకుండా కొందరి కోర్కెలను తీర్చారు. మరికొందరిని ప్రసన్నం చేసుకుని భద్రత కూడకట్టుకునే ప్రయత్నం లోనూ ఆయన సఫలీకృతం అయ్యారు. నూజివీడు, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు వంటి నియోజక వర్గాల్లో బీసీ ఓటర్లను ప్రత్యేకంగా పుట్టా మహేష్‌ ఆకర్షించగలిగారని కూటమి ఒక అంచనాకు వచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు అంకెలు తగ్గకుండా కూటమి అసెంబ్లీ అభ్యర్థులకు మెజార్టీ వస్తుందని, సమాంతరంగా అంతే మొత్తంలోనూ కొంచెం అటు ఇటుగా ఎంపీ అభ్యర్థికి ఓట్లు పడ్డాయని లెక్కకట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో కుక్కునూరు, వేలేరుపాడు, టి.నర సాపురం, కొయ్యలగూడెం వంటి ప్రాంతాల్లో ఎంపీ కూటమి అభ్యర్థి మహేష్‌ వైపే సానుకూలత ఉందని, ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. వైసీపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌కు చాలాచోట్ల మైనార్టీలు, ఇతర వర్గాలు మొగ్గు చూపారని, బీజేపీపై వ్యతిరేఖత కలిగిన ఓటర్లు అంతా ఆ వైపుకే కదిలారని చెబుతున్నారు.

Read Latest AP News and Telugu News

Updated Date - May 21 , 2024 | 02:14 PM