Home » Lok Sabha Polls 2024
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావొస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందేం రాయుళ్ల హడావుడి. నియోజకవర్గాలవారీ ఇప్పటికే కోట్లలో పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఇప్పటికే వందల కోట్ల రూపాయిలు పందేలు కట్టినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందేలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా.. ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారీ క్యాడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందేలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన ఏడో విడత లోక్ సభ ఎన్నిక ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టింది.
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ రోజు ఆప్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేతలు బీజేపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీసు ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ సంచలన ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్‌లో విలీనం అవుతుందని పేర్కొన్నారు. అయితే.. నరేంద్ర మోదీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ లోక్‌సభ స్థానం అభ్యర్థి స్మృతి ఇరానీని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఆమె అమేథీ..
కాంగ్రెస్ చెబుతున్న మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే భారత్ దివాళా తీయడం ఖాయమని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Polls 2024)ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలో పర్యటించారు.
తన పదాలను ప్రధాని నరేంద్ర మోదీ కాపీ కొట్టడాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఆయనతో ఏమైనా చెప్పించగలనని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. మోదీ నోట ఏ మాటలు వినకూడదని..
‘ప్లాన్-బీ’.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక వచ్చే ఫలితాలను బట్టి.. బీజేపీ ‘ప్లాన్-బీ’ అమలు చేయొచ్చనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా..
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.