Share News

TG Cabinet: మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే..!!

ABN , Publish Date - May 19 , 2024 | 02:53 PM

తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన ఏడో విడత లోక్ సభ ఎన్నిక ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టింది.

TG Cabinet: మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే..!!
tg cabinet

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన ఏడో విడత లోక్ సభ ఎన్నిక ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టింది. తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండా మీద మాత్రమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని ఈసీ తేల్చి చెప్పింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారులు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనద్దని షరతు విధించింది.


తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనుమతి గురించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లింది. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వికాస్ రాజ్ చర్చించారు. దీంతో అత్యవసర పనుల విషయంపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈసీ ప్రకటనతో తెలంగాణ మంత్రివర్గ సమావేశం త్వరలో జరిగే అవకాశం ఉంది.



Read Latest
Telangana News and National News

Updated Date - May 19 , 2024 | 02:53 PM