Share News

Amit Shah: అసలేంటీ ‘ప్లాన్-బీ’.. అమిత్ షా ఇచ్చిన సమాధానమేంటి?

ABN , Publish Date - May 18 , 2024 | 08:51 AM

‘ప్లాన్-బీ’.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక వచ్చే ఫలితాలను బట్టి.. బీజేపీ ‘ప్లాన్-బీ’ అమలు చేయొచ్చనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా..

Amit Shah: అసలేంటీ ‘ప్లాన్-బీ’.. అమిత్ షా ఇచ్చిన సమాధానమేంటి?

‘ప్లాన్-బీ’.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Polls 2024) ముగిశాక వచ్చే ఫలితాలను బట్టి.. బీజేపీ (BJP) ‘ప్లాన్-బీ’ అమలు చేయొచ్చనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. కొందరు విపక్ష నేతలు సైతం ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. అయితే.. తమకు ఎలాంటి ‘ప్లాన్-బీ’ కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) క్లారిటీ ఇచ్చారు. తమకు 400 సీట్లు రావడం పక్కా అని మరోసారి ఉద్ఘాటించారు. ఇంతకీ ఈ ప్లాన్-బీ ఏంటి? అందుకు అమిత్ షా ఇచ్చిన సమాధానం ఏంటి? పదండి.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

ఏ సాక్ష్యాలతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు: సుప్రీం


ప్లాన్-బీ

ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే.. ‘ప్లాన్-బీ’ ఏదైనా సిద్ధంగా ఉందా? అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షాకు ఒక ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తూ.. తమకు ఎలాంటి ప్లాన్-బీ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్లాన్-ఏ విజయవంతం అయ్యే అవకాశం 60 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు ‘ప్లాన్-బీ’ అవసరమని, కానీ తమకు పూర్తి మెజారిటీ వస్తుందని కాబట్టి అది అవసరం లేదని స్పష్టం చేశారు. 60 కోట్ల మంది భారతీయులు తమకు అండగా ఉన్నారని, ప్రధాని మోదీ (PM Modi) మరోసారి భారీ మెజారిటీతో తిరిగి వస్తారన్న నమ్మకంతో ఉన్నామని చెప్పారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోతే.. ప్లాన్-బీలో భాగంగా ఎంపీలను బీజేపీ కొనుగోలు చేస్తుందనే ఆరోపణలు వచ్చిన తరుణంలో.. అమిత్ షా పై విధంగా బదులిచ్చారు.

వీడు మహా కేటుగాడు.. వీడియో కాల్ చేసి, బాత్రూంకి వెళ్లనివ్వకుండా..

ఇదే సమయంలో.. ఎన్డీఏ 400కు పైగా సీట్లు గెలిస్తే, భారత రాజ్యాంగాన్ని మారుస్తారని విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై కూడా అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. దేశ రాజకీయాల్లో సుస్థితర తీసుకురావడం కోసమే బీజేపీ 400 సీట్లు గెలవాలని అనుకుంటోందని, రాజ్యాంగాన్ని మార్చేందుకు కాదని తెలిపారు. గత పదేళ్లుగా తమకు పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ ఉందని, కానీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని మార్చాలని అనుకోలేదని వెల్లడించారు. మెజారిటీని దుర్వినియోగం చేసిన చరిత్ర బీజేపీకి లేదని, కాంగ్రెస్‌కే ఉందని ఆరోపించారు. అద్భుత మెజారిటీతో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.


రిజర్వేషన్లపై క్లారిటీ

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ మెరుగైన పనితీరు కనబరుస్తుందని.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అమిత్ షా పేర్కొన్నారు. తమ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంతవరకూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లనూ ఎవరూ ముట్టుకోలేరని అన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కుటుంబ ఆధారితమైనవని, అ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోదీ మూడోసారి కూడా దేశానికి ప్రధాని కాబోతున్నారని, 2029 ఎన్నికల్లోనూ బీజేపీకి ప్రధాని అభ్యర్థి ఆయనే అని అమిత్ షా చెప్పుకొచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 08:51 AM