Home » Lok Sabha Polls 2024
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. సోమవారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సోనియా హాజరై నివాళి అర్పించారు.
లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో కన్నా ఈసారి ఎన్డీఏ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని అందరూ..
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కుతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే..
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.
దేశాభివృద్ధి కోసం కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో మోదీ సుదీర్ఘ లేఖ రాశారు. దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. దేశ పురోగతి ప్రతి ఒక్కరినీ గర్వంతో, కీర్తితో నింపుతుందని పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.
మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవనుంది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను తెరచి ఓట్లను లెక్కిస్తారు.
కొన్ని సీట్లలో గెలుపోటములు లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తుంటాయని రాజకీయ పండితులు చెబుతుంటారు. దానికి తగినట్లే లోక్‌సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లోని 13 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన పార్టీలే గత ఐదు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం గమనార్హం.
అరుణాచల్ ప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్‌సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్‌సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది.