Home » Lucknow
అతనో నిత్య విద్యార్థి నాయకుడు. తన 40ఏళ్ల నాయకత్వ కెరీర్లో 251 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
నేడు ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీం ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
లోక్సభ ఎన్నికలు, పండుగల సీజన్ కావడంతో మే 17వ తేదీ వరకూ ఉత్తరప్రదేశ్లోని లక్నో లో 144 సెక్షన్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శాంతిభద్రత విభాగం జేసీపీ ఉపేంద్ర కుమార్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది.
సాధారణంగా.. జైలులో ఉన్న ఖైదీలకు బయటి వ్యక్తులతో ఎలాంటి సంప్రదింపులు ఉండవు. ఫోన్లో మాట్లాడటం, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు పలకరించడానికి జైలుకు రావడం తప్పితే.. అంతకుమించి బయటి ప్రపంచంతో వారికి కనెక్టివిటీ అనేది ఉండదు. అంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు ఉన్నప్పటికీ.. లక్నో జైలులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.
రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.
స్మగ్మర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పుత్తడిని అక్రమంగా రవాణా చేసేందుకు పలు రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్రమంగా తరలిస్తున్న 4 కేజీలకుపైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆరు వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రసగుల్లాల కోసం జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం అర్దరాత్రి శంషాదాబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.