UP: యూపీలో దారుణం.. ఐదుగురు మహిళల హత్య
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:08 PM
న్యూ ఇయర్ వేళ ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. లక్నోలోని ఓ హోటల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి వచ్చి చూడగా 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.
ఉత్తర ప్రదేశ్: న్యూ ఇయర్ (New Year) వేళ ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో దారుణం (Atrocity) జరిగింది. లక్నో (Lucknow)లోని ఓ హోటల్ (Hotel)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు (Five Womens) హత్యకు (Murder) గురయ్యారు. కుటుంబ కలహాల కారణంగా అర్షద్ (Arshad) అనే వ్యక్తి తన తల్లి, నలుగురు సోదరీమణులను హత్య చేశాడు. మంగళవారం రాత్రి అర్షద్ తన కుటుంబంతో ఆగ్రా నుంచి లక్నోకు వెళ్లాడు. అక్కడ శరంజీత్ హోటల్‌లో ఓ గదిని తీసుకుని వారంతా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరగడంతో అర్షద్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతుల్లో 9 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హోటల్‌కు చేరుకున్న పోలీసులు నిందితుడు అర్షద్‌ను అదుపులోకి తీసుకుని.. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన ఠాణాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబంలో కలహాల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా చెల్లాచెదురుగా పడి ఉన్న ఐదుగురి మృతదేహాలను చూసి షాక్ అయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో నిందితుడు కూడా గదిలోనే ఉన్నాడు. హుటాహుటిన హోటల్‌కు చేరుకున్న పోలీసులు నిందితుడు అర్షద్‌ను అరెస్ట్ చేశారు. మృతుల్లో అర్షద్ తల్లి అస్మాతో పాటు నలుగురు సోదరీమణులు ఆలియా (9 సంవత్సరాలు), అల్షియా (19), రహ్మీన్ (18), అక్సా (16) ఉన్నారు. కాగా, అర్షద్ తండ్రి ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి పరారీలో ఉన్నాడు. ఈ హత్యలో అతడి ప్రమేయం కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్షద్ తండ్రి ఆచూకీ కోసం పోలీసు బృందం ముమ్మరంగా గాలిస్తోంది.
కాగా నిందితుడు అర్షద్ (24) తన కుటుంబ సభ్యులను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. లక్నో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి ఆధారాలు సేకరించారు. పూర్తి విచారణ చేపట్టిన తరువాత మీడియాకు వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే హోటల్ గదిలోకి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగిందా.. అంతకుముందే వీరి మధ్య విబేధాలు ఉన్నాయా.. ఎందుకోసం హత్య చేశాడు.. ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జయసుధ విచారణకు రావాలంటూ నోటీసులు..
మావోయిస్ట్ లీడర్ హీడ్మా టార్గెట్‌గా స్పెషల్ ఆపరేషన్
కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం
కాణిపాక వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News