Share News

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

ABN , Publish Date - Dec 13 , 2024 | 08:12 PM

అకోలాలో జరిగిన మీడియా సమావేశంలో సావర్కర్‌ను కించపరచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కేసు వేశారు. వీరసావర్కర్‌ను ఆంగ్లేయుల సర్వెంట్‌గా, పెన్షనర్‌గా రాహుల్ పేర్కొన్నారని, తన వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడారని ఆరోపించారు.

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: స్వాంతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్‌ (Veer Savarkar)పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి లక్నో కోర్టు శుక్రవారంనాడు సమన్లు పంపింది. 2025 జనవరి10న కోర్టు ముందు హాజరు కావాలని లక్నో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు.

PM Modi: Kumbha Mela: 'ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం' స్ఫూర్తితో మహా కుంభమేళా


కేసు ఏమిటి?

2002 డిసెంబర్‌ 17 నాటి కేసు ఇది. అకోలాలో జరిగిన మీడియా సమావేశంలో సావర్కర్‌ను కించపరచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కేసు వేశారు. వీరసావర్కర్‌ను ఆంగ్లేయుల సర్వెంట్‌గా, పెన్షనర్‌గా రాహుల్ పేర్కొన్నారని, తన వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడారని, సమాజంలో విభజలను ప్రోత్సహించారని ఆరోపించారు.


రాహుల్ అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ, బ్రిటిష్ వారికి సావర్కర్ లేఖ రాశారని, తన చర్యలకు క్షమాపణ చెప్పారని, తద్వారా మహాత్మాగాంధీ, ఇతర స్వాంతంత్ర్య యోధుల పోరాటాన్ని నీరుగార్చారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. చరిత్రను రాహుల్ గాంధీ వక్రీకరించారని, సావర్కర్ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుని అగౌరవపరిచారని విమర్శలు వెల్లువెత్తారు. రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారితో విచారణ జరిపించాలని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.


ఇది కూడా చదవండి..

Mumbai: షిర్డీ ఆలయ భద్రతపై మాక్‌ డ్రిల్‌

Sadhguru: సంపద సృష్టికర్తలను వివాదాల్లోకి లాగొద్దు

For National news And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 08:29 PM