Home » Lucknow
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత ఈ దేశంలోని సిక్కు కమ్యూనిటీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని గురుద్వారా ఆలంబాఘ్‌లో గురుగ్రంధ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో ఆదివారంనాడు ఆయన పాల్గొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్‌పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.
స్వాంతంత్ర్య సమరయోధుడు, ఎమర్జెన్సీ వ్యతిరేక నేత జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద బుధవారంనాడు హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల సాకుతో అధికారులు అనుమతి నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు జేపీఎన్ఐసీ ప్రహరీగోడలు ఎక్కి లోపలకు వెళ్లారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఓవైపు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, బిల్లు అమలులో విషయంలో జరిగే జాప్యంపై బహుజన్ సమాజ్ పార్టీ అ అధినేత్రి మాయావతి అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చినట్టు ఆమె ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాదిని ఆమె భర్తనే దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బాత్రూంలో దాచిపెట్టాడు. తాను స్టోర్ రూంలో దాక్కున్నాడు.
భారీ వర్షాల కారణంగా నేడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ప్రతిరోజు వందల మంది టిఫిన్ బండ్లు పెట్టుకుని వేడి వేడి ఆహారం విక్రయిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూనే.
సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఒక వ్యక్తి షూ విసరడం ఉద్రిక్తతతకు దారితీసింది. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్ వద్ద సోమవారం జరిగిన ఓబీసీ సమ్మేళన్‌లో మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాయర్ దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు మౌర్యపై షూ విసిరాడు. దీంతో వెంటనే మౌర్య మద్దతుదారులు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు.
విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు ఈ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.